అయ్యో నాకు ఛాన్స్ రాలేదే, నాగ చైతన్య హీరోయిన్ తో ఏఎన్నార్ చిలిపి వేషాలు.. పక్కనే కొడుకు, మనవడు ఉండగా

First Published | Oct 11, 2024, 4:03 PM IST

లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ అందరితో సరదాగా ఉండేవారట. మహా చిలిపి మనిషి. అందుకే అప్పట్లోనే ఆయన రొమాంటిక్ హీరో అయ్యారు. ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ మాత్రమే కాదు.. షూటింగ్ బ్రేక్ సమయంలో తమపై ఏఎన్నార్ గారు జోకులు వేసేవారని అప్పటి హీరోయిన్లు పలు సందర్భాల్లో తెలిపారు.

లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ అందరితో సరదాగా ఉండేవారట. మహా చిలిపి మనిషి. అందుకే అప్పట్లోనే ఆయన రొమాంటిక్ హీరో అయ్యారు. ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ మాత్రమే కాదు.. షూటింగ్ బ్రేక్ సమయంలో తమపై ఏఎన్నార్ గారు జోకులు వేసేవారని అప్పటి హీరోయిన్లు పలు సందర్భాల్లో తెలిపారు. ఈ తరం హీరోయిన్లపై కూడా ఆయన ఛాన్స్ దొరికినప్పుడు జోకులు వేస్తూనే ఉన్నారు.  

కొడుకుని, మనవడిని పక్కన పెట్టుకుని కూడా హీరోయిన్ తో చిలిపి వేషాలు వేయడం ఏఎన్నార్ కి మాత్రమే చెల్లింది. నాగ చైతన్య నటించిన చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ కి ఏఎన్నార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ చిత్రం తడాఖా. కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2013లో విడుదలైంది. తడాఖా మూవీ ఒక రకంగా మల్టీస్టారర్ చిత్రం. ఆ టైంలో సునీల్ హీరోగా మంచి జోరు మీద ఉన్నారు. 

Also Read : టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 హీరోలు ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ


నాగ చైతన్య, సునీల్ ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. నాగ చైతన్యకి జోడిగా తమన్నా.. సునీల్ కి జోడిగా సింగర్ ఆండ్రియా నటించారు. తమన్నా అయితే ఈ చిత్రంలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. నాగ చైతన్య, తమన్నా మధ్య కెమిస్ట్రీ భలే కుదిరింది. ఆడియో లాంచ్ వేడుకలో అక్కినేని నాగేశ్వర రావు మాట్లాడుతూ తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర రావు మాట్లాడుతూ ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించారు అని అన్నారు. నాగ చైతన్య రొమాంటిక్ హీరో అయితే.. సునీల్ హ్యూమరస్ హీరోగా ఉన్నారు. 

రొమాన్స్, హాస్యం మనిషి బతకడానికి రెండూ అవసరమే అని ఏఎన్నార్ అన్నారు. ఆడియో లాంచ్ కాబట్టి చిత్ర యూనిట్ తో పాటు గెస్టులు అంతా వేదికపైనే ఉన్నారు. నాగార్జున, నాగ చైతన్య, సునీల్ వీరందరి మధ్యలో ఏఎన్నార్ మాట్లాడుతున్నారు. ఏఎన్నార్ తమన్నా వంకా చూస్తూ.. అమ్మా నీ వయసెంత అని అడిగారు.. ఆ టైంకి తమన్నా వయసు 23 ఏళ్ళు.. ఆమె అదే విషయాన్ని ఏఎన్నార్ కి నవ్వుతూ చెప్పింది. ఏఎన్నార్ జోకులు వేస్తూ అదే వయసు 32 అయితే ఆడవాళ్లు బయట పెట్టుకోరు అని సెటైర్ వేశారు. 

ఇక తమన్నాని చూసాక నా వయసు బాగా తగ్గిపోయింది. తమన్నాని చూశాక నా వయసు 25 అన్నట్లుగా నా మనసు చెబుతోంది. బట్టతల ఉన్నప్పటికీ, జుట్టు తెల్లబడినప్పటికీ మనసు మాత్రం 25 లాగా అనిపిస్తోంది అంటూ తమన్నాపై రొమాంటిక్ కామెంట్స్ చేశారు.అయ్యో కనీసం విగ్గు పెట్టుకుని అయినా ఇలాంటి హీరోయిన్ తో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదే అని ఏఎన్నార్ అన్నారు. దీనితో తమన్నా సిగ్గుపడిపోయింది. వేదికపై ఉన్న వారంతా నవ్వేశారు. పోనిలే నీ మనవడికి అయినా ఆ అవకాశం వచ్చింది అని ఏఎన్నార్ తెలిపారు. పక్కనే మనవడు చైతు, కొడుకు నాగార్జున ఉండగా ఏఎన్నార్ ఇలా తమన్నాపై చిలిపి వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

click me!