నమ్రత గాసిప్స్ పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్,. వినలేం,చెప్పలేం

First Published | Oct 11, 2024, 4:16 PM IST

 సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు, చికాకులు ఉంటాయని అంటుంటారు.. అయితే అలాంటి వాటికి ఈ జోడీ ఎంతో దూరం అని నిరూపించింది.
 

mahesh babu, namratha, rajamouli


మహేష్ బాబు ఏం మాట్లాడినా చాలా సరదాగా ఉంటుంది. అలాగే కొద్దిగా వెటకారం తొంగిచూస్తూంటుంది ఆయన మాటల్లో. ఆయన చెప్పే  విషయాల్లో తన భార్యకు కూడా మినహాయింపు ఇవ్వరు. ఆడవాళ్లు నలుగురు కలిస్తే చెప్పే గాసిప్స్ గురించి ఆయన సరదాగా ఓ మీడియా మీట్ కామెంట్ చేసారు. తన భార్య గాసిప్స్ ని వినలేమని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆవిడ ఏం చెప్తుందో..అంత మహేష్ కూడా వినలేనవి.

mahesh babu, namratha, rajamouli


టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) అనేది అందరూ ఒప్పుకునే సత్య. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటై, సక్సెస్ అయ్యిన జంటల్లో వీరు కూడా ఉన్నారు.

‘వంశీ’ (Vamsi) సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్‌‌లో జరగింది. ఆ సమయంలో మహేష్ - నమ్రత మధ్య మంచి స్నేహం కుదిరింది. అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది. అదే వివాహానికి దారి తీసింది. వీరిది అన్యోన్య దాంపత్యం. 


mahesh babu, namratha, rajamouli


ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా 2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు, చికాకులు ఉంటాయని అంటుంటారు.. అయితే అలాంటి వాటికి ఈ జోడీ ఎంతో దూరం అని నిరూపించింది.


 అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తం పరుస్తూ ఉంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడూ సరదాగా కామెంట్స్ చేస్తూంటారు మహేష్. మహేష్ ఓ సారి మాట్లాడుతూ... అక్కడ ఇలా జరిగిందిట..అక్కడ అలా జరిగిందిట...అంటూ నమ్రత కూడా చెప్తూంటుంది.

ఆమెది ముంబై కదా. గాసిప్స్ ఎక్కువ. తన స్నేహితులతో కలిసినప్పుడు గాసిప్స్ తెగ మాట్లాడుకుంటూంటారు. నేను వింటూ ఉంటాను. కొన్ని గాసిప్స్ అయితే వినలేము కూడా.నేను మీకు చెప్పలేను కూడా అన్నారు మహేష్ . మరి నమ్రత ఈ ఇంటర్వూ విని మహేష్ కు ఏం క్లాస్ పీకారో ఏమో. తన సీక్రెట్స్ బయిట చెప్పేస్తే ఎలా అంతే కదా. 


పర్శనల్ లైఫ్ వస్తే ఈ జంటకి గౌతమ్ (Gautam), సితార (Sithara) అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా మహేష్ కుటుంబంతో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సితార గురించి చెప్పక్కర్లేదు. ఆ పాప ఎంత క్యూట్ ఉంటుందో అంతకు మించి యాక్టివ్ గా ఉంటుంది.

ఇక కొడుకు గౌతమ్‌ ఘటమనేనీ కూడా ఇటు చదువులోనూ.. అటు నటనలో రాణిస్తున్నారు. '1 నేనొక్కడినే'తో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గౌతమ్ ను హీరోగా సిల్వర్ స్క్రీన్ పై క్షణం కోసం ఎదురుచూస్తున్నారు ఘటమనేని ఫ్యాన్స్. ఇక హీరో మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం లెజండరీ డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్దమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.  
 

మహేశ్‌ కోసం నేను షాపింగ్‌ చేయాలి తప్ప.. ఆయన నాకోసం ఎప్పుడూ షాపింగ్‌ చేయడు అంటూ చమత్కరిస్తారు నమ్రతా శిరోద్కర్‌.   మహేష్ చేసే అన్ని ప్రయత్నాలలోను అభిమానులు మద్దతుగా ఉండి అతన్ని సినిమాల కోసం ఇంకా కష్టపడేలా చేస్తారు మహేష్ బాబు అభిమానులకు ఒక ఎమోషన్. ఈ అభిమానం, ప్రేమ మీ కుటుంబ సభ్యులుగా మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మేము మా ప్రేమని మీకు అన్ని మార్గాల్లోనూ అందిస్తాము. మీరు కూడా మా ప్రేమని స్వీకరిస్తారు అని భావిస్తున్నాను అంటారామె.  

Latest Videos

click me!