అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ లీక్.. నిజమే అయితే ఫ్యాన్స్ కి పూనకాలే

Published : May 26, 2025, 08:11 PM IST

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యింది. 

PREV
14
ఇండియాలో అత్యంత డిమాండ్‌ ఉన్న దర్శకుడు అట్లీ

 `రాజా రాణి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అట్లీ. ఆ తర్వాత  విజయ్‌తో `తెరి`, `మెర్సల్`, `బిగిల్` వంటి హ్యాట్రిక్ హిట్ చిత్రాలను అందించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి షారుఖ్ ఖాన్‌తో `జవాన్` అనే మాస్ హిట్ చిత్రాన్ని అందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. `జవాన్` సక్సెస్‌ అట్లీ కెరీర్‌నే మార్చేసింది. ఇండియాలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న దర్శకుడిగా మారిపోయారు అట్లీ. 

24
హాలీవుడ్ తరహాలో అల్లు అర్జున్‌ మూవీ

అట్లీ తదుపరి చిత్రం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ స్కేల్‌లో నిర్మించబోతుంది.  ఇది టైమ్ ట్రావెల్ చిత్రం కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్లతో పని చేయాలని అట్లీ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి యానిమేషన్ పాత్ర. దాని కోసం ప్రపంచ స్థాయి VFX టీమ్‌లను దించుతున్నారు. 

34
అట్లీ - అల్లు అర్జున్ సినిమాకు 700 కోట్ల బడ్జెట్

అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అందులో హీరో అల్లు అర్జున్‌కు 300 కోట్లు, అట్లీకి 100 కోట్లు పారితోషికంగా ఇచ్చింది సన్ పిక్చర్స్. ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారట. ప్రస్తుతానికి జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సమంత కూడా మెరవబోతుందట. మరో ఫారెన్‌ హీరోయిన్‌ని తీసుకోబోతున్నారని సమాచారం. 

44
అట్లీ - అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఇదేనా?

ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీగా ఉన్నారు అట్లీ.  ఇందలో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఆన్‌లైన్‌లో లీక్ అయి వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని తెలుస్తుంది.  అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అని పిలుస్తారు. అందుకే అభిమానులకు ఈజీగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారా? లేదంటే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇదే సరైన టైటిల్ అని భావించి పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఈ ప్రచారంలో నిజమెంతా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories