ఈ సినిమాలో టీనా మల్హోత్రా పాత్రలో నటించడానికి ఐశ్వర్యా రాయ్ కి అవకాశం ఇచ్చారు కరణ్ జోహార్. కానీ, తన ఇమేజ్ గురించి ఆలోచించి ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నారు. షారుఖ్ కి జంటగా రాణీ ముఖర్జీ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
28
2. కహో నా ప్యార్ హై (2000)
హృతిక్ రోషన్ నటించిన తొలి సినిమాని కూడా ఐశ్వర్య వద్దనుకున్నారట. ఆమె స్థానంలో అమీషా పటేల్ నటించి అదరగొట్టారు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి ఐశ్వర్యారాయ్ ‘ధూమ్ 2’, ‘జోధా అక్బర్’ లాంటి సినిమాల్లో నటించారు.
38
3. గదర్: ఏక్ ప్రేమ్ కథా (2001)
అనిల్ శర్మ దర్శకత్వంలో, సన్నీ డియోల్ హీరోగా నటించిన `గదర్: ఏక్ ప్రేమ్ కథా` లో హీరోయిన్‌గా మొదట ఐశ్వర్యారాయ్ ని నటింపచేయాలని అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేశారు. ఆ అవకాశం అమీషా పటేల్ కి దక్కింది. ఇది ఆమె లైఫ్‌నే మార్చేసింది.
సంజయ్ దత్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఐష్‌ని అప్రోచ్ అయ్యారు. కానీ ఐశ్వర్య ఈ అవకాశాన్ని వదులుకోవడంతో, అది గ్రేసీ సింగ్ కి వెళ్ళింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
58
5. వీర్-జారా (2004)
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు యష్ చోప్రా ముందుగా ఐశ్వర్యను సంప్రదించారు. ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉందని చెప్పి ఐశ్వర్య రిజెక్ట్ చేశారు. షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఆయనకు జోడీగా ప్రీతి జింటా నటించారు. ఇది కూడా మంచి ఆదరణ పొందింది.
68
6. భూల్ భులయ్యా (2007)
ఈ మూవీలో కూడా దర్శకుడు ప్రియదర్శన్ మొదటి ఛాయిస్ ఐశ్వర్యనే అని సమాచారం. కానీ ఎందుకో ఆమె ఈ సినిమా చేయలేదు. దీంతో ఐశ్వర్య స్థానంలో విద్యా బాలన్ ని తీసుకున్నారు.
78
7. దోస్తానా (2008)
జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఐశ్వర్యనే కలిశారు దర్శకుడు. కానీ ఆమె నో చెప్పడంతో చేసేదేం లేక ప్రియాంక చోప్రాకు ఆఫర్ చేశారు. ఆమె చేసింది, బ్లాక్ బస్టర్ అందుకుంది.
88
8. బాజీరావ్ మస్తానీ (2015)
ఈ సినిమాని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొదట ఐశ్వర్య, సల్మాన్ లతో చేయాలనుకున్నారు. కానీ ఇద్దరు నో చెప్పారు. దీంతో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లతో తీశారు భన్సాలీ. ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా దాదాపు ఎనిమిది హిట్ మూవీస్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఐష్ కోల్పోవడం గమనార్హం. ఈ సినిమాలు పడితే ఐశ్వర్య రేంజ్ వేరేలా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.