`గంగోత్రి` సినిమా పూర్తయ్యాక కొంత మందికి మూవీని చూపించారు రాఘవేంద్రరావు. వాళ్లు చూసి అంతగా లేదన్నారట. ఈ మూవీ రిలీజ్ అయితే అల్లు అర్జున్ కెరీర్ అయిపోయినట్టే అన్నారట. ఈ విషయం అల్లు అరవింద్ వరకు వెళ్లింది. ఆయన కూడా చూసి సినిమా బాగా రాలేదు, దీన్ని తీసి గోదాంలో పడేయండి అన్నారట. వంద సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఏంటి సినిమాని ఇలా అంటున్నారని ఆయన ఆందోళనకు గురయ్యారు. చాలా టెన్షన్ పడ్డారట. మళ్లీ కుదురుకుని అందరిని కూర్చోబెట్టి ముందుగా తాను చెప్పిన కథ చెప్పాడట. కథగా బాగుందని, సినిమాగా చూస్తే అంతగా ఎక్కడం లేదన్నారట. మళ్లీ సీన్ బై సీన్ వివరించారు రాఘవేంద్రరావు. దీంతో కొంత వరకు కన్విన్స్ అయ్యారు.
కానీ అల్లు అరవింద్‌కి ఎక్కడో కొడుతుంది. ఫైనల్ మిక్సింగ్ అయ్యాక సినిమాని ఎట్టకేలకు రిలీజ్ చేశారు. మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాగానే ఆడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు.