యష్మికి ప్రపోజ్ చేసిన గౌతమ్, అవినాష్ కు ఎలివేషన్లు ఎక్కువగా ఇస్తున్న నాగార్జున,

First Published | Oct 20, 2024, 12:10 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఏడో వీకెండ్ రానే వచ్చింది. ఇక నాగార్జున ఈసారి కాస్త వెరైటీగా  అందరికి క్లాస్ పీకారు. హౌస్ లో ఉన్నవారితోనే.. వారి వీక్ పాయింట్స్ చెప్పించారు. 

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో చాలా మార్పులు కనిపించాయి. టాస్క్ల విషయం పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌస్ లో మరో జంట బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వాళ్లు ఎవరో అందరికి తెలిసిందే.  ఈ ప్రేమ పిచ్చి ఎంత వరకూ ముదిరిందంటే.. డైరెక్ట్ గా యష్మిదగ్గర ఓపెన్ అయ్యాడు గౌతమ్. తనంటే క్రష్ ఉందంటూనే.. ఫ్రెండ్స్ అంటూనే.. బయటు వెళ్లాక చూసుకుందా అని చెప్పేశాడు. 
 

అయితే యష్మి మాత్రం ఏమీ ఎరగనట్టే.. అమాయకత్వం నటిస్తూ.. ఏదో సమాధానం చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాన్ని పృధ్వీ, విష్ణు ప్రియ ముందు ఓపెన్ అయ్యింది యష్మి. తన వెర్షన్ మాత్రం ఏం చెప్పకుండా అందరిని కన్ ఫ్యూజన్ లో పెట్టింది. ఇక ఈ విషయాన్ని పట్టుకుని నాగార్జున కూడా కాస్త ఆటపట్టించాడు గౌతమ్, యష్మిని. 
 


ఇక వీకెండ్ శనివారం ఎపిసోడ్ అంతా విచిత్రంగా జరిగింది. ఈ సారి నేను కాదు.. మీలో మీరే.. మీ తప్పులు ఒప్పుకునేలా చేసస్తాను అని వింత గేమ్ ఆడించాడు బిగ్ బాస్ అందులో మణికంటను డ్రామా పీక్స్ . అని..పృధ్వీ మర్యాదగా ఉండాలని.. విష్ణు ప్రియ వీకెండ్ గేమ్ ఆడటం కాదు.. వారమంతా ఆడాలని అన్నారు. 

ఇక మెహబూబ్ ఫెయిల్యూర్ చీఫ్ అని,  నబిల్ ఆటలో పిల్లి అయిపోయాడని, నిఖిల్ ఆటలో సత్తా చాటలేకపోతున్నాడని, ప్రేరణ గుంపులో గుర్తింపు కోరుకోవద్దని, టేస్టీ తేజ మత్తు వదిలి యాక్టీవ్ అవ్వాలని రకరకా ట్యాగ్ లు పెట్టారు నాగార్జున. ఇంట్లో వాళ్ల అభిప్రయాాలు తీసుకుంటే వారికి ట్యాగ్ లు ఇచ్చేశాడు. ఇక ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.. బయటకు వచ్చాయి.

అదేంటంటే.. ఈ గేమ్ ఆడటం నా వల్ల కాదు. నేను ఏం చేసినా..  ఆడినా స్టాటజీ అంటున్నారు. నానా నేను ఉండలేను అలా. అందకు నేను బయటకు వెళ్ళిపోతబోతున్నాను అని అన్నారు మణికంఠ. దానికి నాగార్జున సింపుల్ ఆన్సర్ ఇచ్చేశారు. ఇక ఈ విషయంలో నాగార్జున స్పందిస్తూ.. ఆడియన్స్ ఏది డిసైడ్ చేసి ఓట్లేస్త  అదే జరుగుతుంది అన్నారు నాగార్జున.

 ఇలా బిగ్ బాస్ ట్వీస్ట్ మమూలుగా లేదు. ఇక శనివారం నామినేషన్స్ నుంచి ప్రేరణ, టేస్టీ తేజ ముందుగా సేవ్ అయ్యారు మిగతా వాళ్ల భవిత చూడాలి. ఇక ఈ వీకెండ్ లో అవినాష్ కు ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చాడు నాగార్జున. ఆట బాగా ఆడావ్ అంటూ.. మైనస్ లు చెప్పకుండా... ప్లాస్ లు ఏకరువు పెట్టి.. అవినాష్ కు సర్ ప్రైజ్ లు కూడా ఇచ్చాడు. 
 

Latest Videos

click me!