బిగ్‌ బాస్‌ సంచలన నిర్ణయం.. టేస్టీ తేజని కాదని మణికంఠని ఎలిమినేషన్‌కి అసలు కారణమిదే, యష్మి చెప్పిందే నిజమైంది?

First Published Oct 20, 2024, 8:14 AM IST

మణికంఠ ఎలిమినేషన్‌కి సంబంధించిన అసలు కారణాలు తెలుస్తున్నాయి. బిగ్‌ బాస్‌ సంచలన నిర్ణయం వెనుక ఏం జరిగిందనేది బయటకు వచ్చింది. యష్మి చెప్పిందే నిజమైంది?

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ షో ఏడో వారం ఎలిమినేషన్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. మణికంఠ ఎలిమినేట్‌ కాబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. మొదట తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా టేస్టీ తేజ ఎలిమినేట్‌ కాబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. కానీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సడెన్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్‌ బాస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యమైన నిర్ణయంతో అందరికి షాకిచ్చాడు. మణికంఠని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇదిలా ఉంటే మణికంఠ ఎలిమినేషన్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. చాలా మంది మణికంఠని అన్యాయంగా తీసేస్తున్నారని అంటున్నారు. ఇన్నాళ్లు హౌజ్‌లో కింగ్‌లాగా ఉన్నాడని, హౌజ్‌ని పరోక్షంగా రూల్‌ చేశాడని, చాలా విషయాల్లో తనే హైలైట్‌ అయ్యాడని అంటున్నారు. అదే సమయంలో మణికంఠ వెళ్లిపోవడమే బెటర్‌ అని, గేమ్‌ ఆడటం లేదు, సింపతీ గేమ్‌ లు ఆడుతున్నాడని, చాలా టూ మచ్‌ డ్రామా క్రియేట్‌ చేస్తున్నాడనే వాళ్లు కూడా ఉన్నారు.

ఇలా విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. టాస్క్ ల్లో వీక్‌గా ఉంటున్నాడని, ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నాడని, ఏమాత్రం గేమ్స్ ఆడటం లేదని హౌజ్‌మేట్స్ అంతా కంప్లెయింట్‌ చేశారు. ఆయన్ని టార్గెట్‌ చేశారు. అంతేకాదు చాలా సందర్భాల్లో ఇతర సభ్యుల మధ్య గొడవలకు తనే కారణం అవుతున్నాడని, కావాలని పెద్ద డ్రామా క్రియేట్‌ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. 
 

Latest Videos


ఎలిమినేషన్‌కి సంబంధించి ముందుగానే హోస్ట్ నాగార్జున హింట్‌ ఇస్తుంటాడు. వాళ్ల గురించి, వాళ్ల ఆటతీరుగురించి చెబుతాడు. క్లాస్‌ పీకుతాడు. శనివారం ఎపిసోడ్‌లో మణికంఠని టార్గెట్‌ చేస్తూ షో జరిగింది. ఇందులో ఆటలో వీక్‌, డ్రామాలో పీక్‌, కన్నీళ్లు మాత్రమే నా ఆయుధం అనే ట్యాగ్‌ ఇచ్చింది యష్మి. దీన్ని చాలా మంది హౌజ్‌మేట్స్ సపోర్ట్ చేశారు. ఇదే మణికంఠ టార్గెట్‌ అవుతున్నాడనే విషయం అర్థమవుతుంది.

ఈ సందర్భంగానే మణికంఠ వివరణ ఇస్తూ తనకు అవడం లేదు, తాను ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్‌ అయిపోతున్నా అని తెలిపారు. తన హెల్త్, బ్రెయిన్‌ సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. హార్ట్ లో పెయిన్‌ స్టార్ట్ అవుతుందని, బ్రెయిన్‌ పనిచేయడం లేదు, బోన్స్ నొప్పిగా ఉన్నాయని, కూర్చుంటే నిలబడలేకపోతున్నా అని, పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నారు. ఆగ్జైటీ ట్రిగ్గర్‌ అవుతుందన్నాడు. నిజంగానే ఈ ఆట అంటే ఇష్టమని, కానీ ఆడలేకపోతున్నా అని, తనని బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి పంపించమని వేడుకున్నాడు. 

దీనికి హోస్ట్ నాగార్జున స్పందిస్తూ ఓటింగ్‌ ఎలా ఉందో, ఆడియెన్స్ ఏం డిసైడ్‌ చేశారో చూద్దామన్నారు. అయితే చివరగా ఓటింగ్‌ ప్రకారంగానే మణికంఠని ఎలిమినేట్‌ చేశారని సమాచారం. అంటే తేజని కాదని మణికంఠని కావాలనే ఎలిమినేట్‌ చేసినట్టు తెలుస్తుంది. అందుకు కారణం మణికంఠ చెప్పిన కారణాలే అని తెలుస్తుంది. పైగా ఇటీవల ఆయన గేమ్‌లు ఆడటం లేదు.

సింపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. మొన్న తాను మరో రెండు వారాలు ఉంటే గంగవ్వకి ముక్కుపుడుక కోనిస్తా అన్నాడు. వడ్డానం కొనిస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ ఇప్పుడు నాగ్‌ ముందు తాను వీక్‌ అయిపోయినా వెళ్లిపోతా అని చెప్పడం ఆశ్చర్యంగా మారింది. అంతకు ముందు హౌజ్‌లో కూడా హరితేజతో తాను వెళ్లిపోతా అని, తన వల్ల అవడం లేదని తెలిపారు.

కోడిబుర్రతో ఏం చేసిన రాంగ్ గా వెళ్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు ఓట్‌ చేయోద్దు అన్నాడు. అయితే పోయే ముందు ఎంటర్‌టైన్‌ చేసి వెళ్తానని చెప్పాడు. ఇలా మణికంఠ డబుల్‌ గేమ్‌ని పరిగణలోకి తీసుకుని ఆయన్ని సాధారణ ఎలిమినేషన్‌ ద్వారానే బయటకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

యష్మి ముందు నుంచి చెబుతుంది. మణికంఠ డ్రామా ఆడుతున్నాడని, సింపతీ గేమ్‌ ఆడుతున్నాడని, తన హార్ట్ బ్రేక్‌ చేశాడని చెప్పింది. ఇప్పుడు శనివారం ఎపిసోడ్‌లోనూ ఆయనకు సరైన హెడ్‌లైన్స్ ఇచ్చింది. ఆమె చెప్పినట్టుగానే ఆయన తాను వీక్‌ అని ఒప్పుకున్నాడు. ఎలిమినేట్‌ కూడా అయినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. మణికంఠ తన నిర్ణయంతో తేజని సేవ్‌ చేశాడని చెప్పొచ్చు. అదే సమయంలో తేజ అంతో ఇంతో మణికంఠ కంటే ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. నవ్విస్తున్నాడు. ఆయన ఉండటం కూడా కరెక్ట్ అనే చెప్పొచ్చు. 

Read more: యష్మికి ప్రపోజ్ చేసిన గౌతమ్, అవినాష్ కు ఎలివేషన్లు ఎక్కువగా ఇస్తున్న నాగార్జున,
 

Also read: ప్రశాంత్‌ నీల్‌తో రామ్‌ చరణ్‌ సినిమా.. ఆనంద పడలా, బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.. నిరాశ పరిచే అంశమిదే!

click me!