ఎన్టీఆర్ తో సినిమాను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Jul 01, 2025, 11:19 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ హీరో. ఆయనతో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. అటువంటిది తారక్ తో సినిమాను ఓ స్టార్ హీరోయిన్ మూడు సార్లు రిజెక్ట్ చేసిందంటే నమ్ముతారా?

PREV
15

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియాను శాసిస్తున్నారు. అంతే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ఎన్టీఆర్ ఇమేజ్ పాకిపోయింది. దాంతో ఆయన సినిమాలపై కూడా అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి.

 ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తారక్ దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. త్వరలో బాలీవుడ్ మూవీ వార్ 2తో ఆడియన్స్ ను అలరించబోతున్నారు. ఈసినిమా సక్సెస్ అయితే బాలీవుడ్ లో తారక్ కు తిరుగులేని ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది.

25

ఇప్పటికే ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ కు మాత్రం అనుకున్నంత స్థాయిలో నార్త్ మార్కెట్ లేదు. అందుకే వార్ 2 కోసం తారక్ ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కు ఇంత స్టార్ డమ్ రావడంతో ఆయనతో సినిమా చేయడం కోసం హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉన్నారు.

35

ఛాన్స్ వస్తే చాలు జూనియర్ ఎన్టీఆర్ జతగా నటించాలని చాలామంది స్టార్ హీరోయిన్లు కోరుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ జోడీగా నటించే ఛాన్స్ వస్తే బాగుండు అని ఆశపడుతున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అందరకి తెలిసిందే. 

కొరటాల డైరెక్షన్ లో దేవర సినిమాతో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు, వార్ 2, దేవర2 సినిమాలతో అల్లాడించబోతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. ఈక్రమంలో ఎన్టీఆర్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

45

ఎన్టీఆర్ సినిమా లో ఆఫర్ కోసం ఎంతో మంది ఎదరు చూస్తుంటే.. ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అది కూడా మూడు సార్లు. ఇదే న్యూస్ బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది . మూడుసార్లు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా.. రకరకాల కారణాల వల్ల వదిలేసిందట ఆహీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు, బాలీవుడ్ ముద్దు గుమ్మ.. ఆర్ఆర్ఆర్ బుట్ట బొమ్మ ఆలియా భట్.

55

అవును ఎన్టీఆర్ తో సినిమా ఆఫర్ వస్తే.. కానీ కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట . ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆలియా భట్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కాకుండా రామ్ చరణ్ కి జోడిగా నటించింది ఆలియా భట్. 

నిజానికి దేవర సినిమాలో ఆలియా భట్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అనకున్నారు. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశం మరోసారి మిస్ చేసుకునింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories