తాగిన మత్తులో శివుడికే సవాల్‌ విసిరిన రాజశేఖర్‌, దెబ్బకి అందరిలో ఛీ కొట్టిన అమ్మాయే ఐ లవ్యూ చెప్పింది

Published : Jul 01, 2025, 08:58 AM IST

రాజశేఖర్‌.. జీవితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అంతకంటే ముందే చాలా లవ్‌ స్టోరీస్‌ ఉన్నాయి. కాలేజీలో ఐదేళ్లు తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించాడట. 

PREV
15
క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అవుతున్న రాజశేఖర్‌

యాంగ్రీ మ్యాన్‌ రాజశేఖర్‌ కెరీర్‌ ఇప్పుడు అంత సవ్యంగా సాగడం లేదు. హీరోగా సినిమాలు లేవు. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆయన నితిన్‌ `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో ముఖ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ ఆడలేదు. ఇప్పుడు శర్వానంద్‌ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. 

దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సింది. ఇదిలా ఉంటే రాజశేఖర్‌కి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది.

25
రాజశేఖర్‌ క్రేజీ లవ్‌ స్టోరీ

ప్రతి ఒక్కరి లైఫ్‌లో పెళ్లికి ముందు ప్రేమ కథలు ఉంటాయి. అలా హీరో రాజశేఖర్‌ జీవితంలోనూ ఉంది. కాలేజీ రోజుల్లో లవ్‌ స్టోరీ అది. అయితే రాజశేఖర్ ఈ లవ్‌ స్టోరీ చాలా క్రేజీగా ఉండటం విశేషం. 

ఆయన తనకంటే ఐదేళ్ల అమ్మాయిని ప్రేమించారట. రోజూ ఆమె వెంటపడ్డారట. కానీ ఆమె రాజశేఖర్‌ని పట్టించుకోలేదు. దీంతో ఎలాగైనా ఆమెని దక్కించుకోవాలనుకున్నాడు, ఆయన ఆగడాలు ఎక్కువైపోయాయట. 

దీంతో ఆమె ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది. ఏకంగా అందరి ముందు తిట్టిందట. దీంతో బాగా హర్ట్ అయ్యారు రాజశేఖర్‌. బాధలో ఉన్న ఆయన్ని ఫ్రెండ్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు.

35
తాగిన మత్తులో శివాలయం వద్దకు వెళ్లి సవాల్‌

ఫ్రెండ్స్ తో కలిసి రాజశేఖర్‌ మందేస్తూ తన బాధని పంచుకున్నారు. ఈ క్రమంలో స్నేహితుడు ఆయన్ని రెచ్చగొట్టాడు. రాజశేఖర్‌ దేవుడిని నమ్మరు. దేవుడిని నమ్మకపోవడం వల్లే నీకు ఇలా జరిగిందని చెప్పాడట. 

దీంతో ఆ మత్తులో ఏకంగా శివుడి వద్దకు వెళ్లిపోయాడు రాజశేఖర్‌. తమ ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి తాగిన మత్తులో దేవుడికే సవాల్‌ విసిరారు. `దేవుడా మీపై నమ్మకం లేదు. తాగి ఉన్నాను సారీ, అమ్మాయిని ప్రేమించాను, ఆమె నన్ను ఛీ కొట్టింది.

 ఆ అమ్మాయి చేత ఐ లవ్యూ చెప్పిస్తే మిమ్మల్ని నమ్ముతాను. లేదంటే మీరు కేవలం రాయి మాత్రమే` అని దేవుడికి సవాల్‌ విసిరి వచ్చారట రాజశేఖర్‌. తాగిన మత్తులో ఆ రాత్రి శివాలయం వద్ద వీరవిహారం చేశారట.

45
ఆరునెలల్లో రాజశేఖర్‌ కి ఐ లవ్యూ చెప్పిన అమ్మాయి

కట్‌ చేస్తే ఆరు నెలల్లో ఏం జరిగిందో ఏమో ఆ అమ్మాయినే తన వద్దకు వచ్చి ఐ లవ్యూ చెప్పిందట. రారా పోరా అన్న అమ్మాయి రండి, పోండి అని పిలిచిందట. 

కానీ ఆ లవ్‌ స్టోరీ చివరికి బ్రేకప్‌ అయ్యిందని తెలిపారు రాజశేఖర్‌. అలీతో సరదాగా షోలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత తన లైఫ్‌లో చాలా లవ్‌ స్టోరీస్‌ ఉన్నట్టు చెప్పారు. 

ఇక సినిమాల్లోకి వచ్చాక ఓ తమిళ చిత్రంలో రాజశేఖర్‌ హీరో, జీవితని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆమె బాగా లేదని రాజశేఖర్‌ దర్శకుడితో చెప్పారట. కట్‌ చేస్తే మరుసటి రోజు ఆయన్నే హీరోగా తీసేశారు. 

మరో సినిమాలో జీవిత, రాజశేఖర్‌ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక ఉన్నారు. వాళ్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

55
చిరంజీవి లాంటి హీరోలకే పోటీ ఇచ్చిన రాజశేఖర్‌

డాక్టర్‌ గా కెరీర్‌ని ప్రారంభించిన రాజశేఖర్‌ ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే హీరోగా ఎదిగారు. స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఓ దశలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి వారికి గట్టి పోటీ ఇచ్చారు. వరుస విజయాలు అందుకున్నారు. యాక్షన్‌ సినిమాలతో స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌, కామెడీ, ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. 

సెంటిమెంట్‌ చిత్రాలు కూడా చేసి ఆకట్టుకున్నారు. కానీ గత పదేళ్లుగా రాజశేఖర్‌ కెరీర్‌ గాడి తప్పింది. ఇప్పుడు క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories