రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్ ? పాప పేరు ఫిక్స్ అయిన హీరోయిన్?

Published : Mar 07, 2025, 11:50 AM IST

అభిమానులకు మరో శుభవార్త చెప్పడానికి ఆలియా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి మొదటి కూతురు రాహాకు రెండేళ్లు నిండుతుండగా.. మరో బిడ్డను వారు ప్లాన్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్.  

PREV
16
రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్ ? పాప పేరు ఫిక్స్ అయిన హీరోయిన్?
Alia Bhatt, Ranbir Kapoor with Raha

బాలీవుడ్ స్టార్ హీరోయిన్  అలియా భట్ తన రెండవ బిడ్డకు తల్లి కావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా, మగబిడ్డ కోసం ఆరాటపడుతున్నట్లుంది. ఈ విషయం గురించి అలియా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలియా తన పుట్టబోయే బిడ్డకు ఒక పేరును కూడా నిర్ణయించుకుంది. కానీ పేరు మాత్రం వెల్లడించలేదు. 

Also Read: ఓటీటీలో దుమ్మురేపుతోన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే?

26

బాలీవుడ్‌లో చాలా చిన్నవయన్సులోనే స్టార్ హీరోయని్ గా ఎదిగిన వారిలో ఆలియా భట్ ముందు ఉన్నారు. చాలా  తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది  ఆలియా.. రణబీర్ కపూర్ తో నాలుగైదేళ్ళు డేటింగ్ చేసిన తరువాత  కపూర్ కుటుంబానికి కోడలు అయ్యింది బ్యూటీ.

పెళ్లైన కొన్ని నెలలకే ఆలియా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది, ఆమెకు రహా అని పేరు పెట్టింది. ఈ పేరు గురించి చర్చ జరుగుతుండగా, అలియా మరో బిడ్డ గురించి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రహాకి ఇప్పటికే రెండు సంవత్సరాలు. కాబట్టి ఆలియా, రణబీర్ కపూర్ మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

36

ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా, ఆలియా తన పేరు ద్వారా అందరికి హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆమె ఏం చేప్పిందంటే?  అలియా భట్ ఇటీవల జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో కనిపించింది. తన కూతురికి రహా అని ఎందుకు పేరు పెట్టారో ఆలియా అక్కడ వివరించింది.

తల్లిదండ్రులు కావాలని ఆసక్తిగా ఉన్న ఆలియా , రణబీర్, కుటుంబతో సహా.. స్నేహితులు, దగ్గరి వారితో పాటు తమ బిడ్డ పేరు గురించి తీవ్రమైన చర్చ జరిపారు. ఈ సమయంలో చాలా మంది పిల్లలు పేర్లు పంపారు. అప్పటికి ఆలియా గర్భవతి, వారికి ఏ బిడ్డ పుడుతుందో తెలియని సమయంలోనే పేరు గురించి అంత పెద్ద  చర్చ జరిగిందట. 

Also Read: గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

46

ఆలియా, రణబీర్ మంచి పేర్లను సేకరించడం ప్రారంభించారట అప్పుడు. చాలామందికి మంచి పేర్లు పంపించమని మెసేజ్ లు కూడా పెట్టారట.  ఆ టైమ్ వచ్చినప్పుడు తొందర తొందరగా పేరు పెట్టేకంటే.. ముందే అనుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు అనేది వారి ప్లాన్.

అందుకే తమ మొదటి కూతురు రహాకు ఎలాగైతే ముందే అనుకుని పేరు పెట్టారో.. తమ తరువాతి బిడ్డకు కూడా అదే విధంగా పేరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆలియా, రణ్‌బీర్‌లకు ఆ అబ్బాయి పేర్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. దీన్ని బట్టి వారు రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారని.. అందులోను మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్నారని అర్ధం అవుతోంది. 

Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

56

ఆ ఇంటర్వ్యూలో  తాము రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్టు హింట్ అయితే ఇచ్చింది కాని.. ఆ పేరు ఏమిటో అలియా చెప్పలేదు. తన పేరు చెప్పవద్దని అడిగినప్పుడు అలియా సిగ్గుపడుతూ ఉండటం చూసి, అభిమానులు అలియా త్వరలో శుభవార్త చెబుతుందని అర్ధం చేసుకుంటున్నారు.

అంతే కాదు తమ మొదటి కూతురు  రాహా పేరును ఎవరు సెలక్ట్ చేశారో అలియా వెల్లడించింది. ఆలియా అత్తగారు నీతు కపూర్ రహా పేరును సూచించారు. రీతు కపూర్ మాట్లాడుతూ, రహా అనే పేరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరికీ సరిపోతుందని చెప్పింది. 

Also Read: 2500 కోసం రోడ్డు మీద డాన్స్ చేసిన హీరోయిన్, స్టార్ హీరో కూతురికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?

66

నాకు రహా అనే పేరు కూడా నచ్చింది. రహా అంటే శాంతి, ఆనందం అని అలియా భట్ అన్నారు. తమ సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా, రణ్‌బీర్ కపూర్‌లు తరచుగా తమ కూతురితో కనిపిస్తారు. రాహాను చూడటానికి అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు.  రహా కూడా రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో అందరికి హాయ్ చెపుతూ.. ప్లై కిస్ లు ఇస్తూ సందడి చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories