అక్కినేని అమల ముందు ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్, తనకి ఇష్టమైన మూవీ ఏదో చెప్పేశాడు

Published : Mar 07, 2025, 11:34 AM IST

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే చిత్రం అవుతుందని ఇటీవల మైత్రి నిర్మాత రవిశంకర్ హైప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

PREV
14
అక్కినేని అమల ముందు ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్, తనకి ఇష్టమైన మూవీ ఏదో చెప్పేశాడు
Prashanth Neel, Akkineni Amala

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే చిత్రం అవుతుందని ఇటీవల మైత్రి నిర్మాత రవిశంకర్ హైప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

24

ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఉగ్రం, కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్ 1 మొత్తం నాలుగు చిత్రాలని తెరకెక్కించారు. ఈ నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ తెరక్కించినవన్నీ మాస్ చిత్రాలే. తాజాగా ప్రశాంత్ నీల్ అన్నపూర్ణ స్టూడియోస్ కాలేజీలో అక్కినేని అమలతో కలసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో అమల అక్కినేని అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 

34
Akkineni Amala

అన్నీ మాస్ చిత్రాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ కి ఆ జోనర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదట. కానీ అవే చిత్రాలు చేస్తున్నాడు. నేను ఇంట్లో టివిలో మూవీ చూస్తే మాస్ చిత్రాలు చూడను. హాలీవుడ్ చిత్రం ఇన్సెప్షన్ లాంటి సినిమాలు ఆసక్తిగా చూస్తాను. లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ మూవీ చూస్తాను. హమ్ అప్ కే హైన్ కౌన్ లాంటి సినిమాలు చూస్తానని ప్రశాంత్ నీల్ తెలిపారు. కెజిఎఫ్ లాంటి గూస్ బంప్స్ తెప్పించే చిత్రాలు చేసిన నీల్ ఆ జోనర్ సినిమాలు ఇష్టం ఉండవని చెప్పడం సంచలన విషయమే. 

44

గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి లాంటి స్టార్ హీరోల తెలుగు చిత్రాలు చూసి ఇన్స్పైర్ అయ్యానని అందుకే హీరో ఎలివేషన్ ఉండే చిత్రాలు చేస్తున్నానని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories