ఆ స్టార్‌ హీరోయిన్‌ భుజంపై చేయివేయడానికే వణికిపోయిన ఏఎన్నార్, ఆమె ఏం చేసిందో తెలిస్తే మతిపోతుంది!

First Published | Oct 9, 2024, 11:24 AM IST

ఏఎన్నార్‌ తో చేయడానికే చాలా మంది హీరోయిన్లు భయపడేవాళ్లు. కానీ ఆయనే భయపడ్డాడు. ఓ హీరోయిన్‌తో యాక్ట్ చేయడానికి వణికిపోయాడట. ఆమె ఎవరు? ఆ కథేంటో చూస్తే. 
 

అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్‌) తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోల్లో ఒకరు. లెజెండరీ యాక్టర్. టాలీవుడ్‌కి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను పిలుస్తారనే విషయం తెలిసిందే. అదే సమయంలో సినిమాల్లో డాన్సులు పరిచయం చేసింది ఏఎన్నారే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన డాన్సులకు అప్పట్లో విపరీతమైన క్రేజ్‌ ఉండేది. నాటకాలు, క్లాసికల్‌ డాన్సులు మనుగడలో ఉన్న ఆ రోజుల్లో వెస్ట్రన్‌ డాన్స్ రుచి చూపించారు ఏఎన్నార్‌. అందుకే ఆయనది తెలుగు సినిమాల్లో ప్రత్యేకస్థానం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఏఎన్నార్‌ని సావిత్రి ఎంతగానో అభిమానించిన విషయం తెలిసిందే. ఆయన్ని చూసేందుకు సినిమాల్లోకి వెళ్లిందని అంటుంటారు. ఆయన్ని చూసి రెండు మూడు సార్లు కళ్లు తిరిగి కింద పడిపోయిందని చెబుతుంటారు. అంతటి అభిమానం ఉన్న సావిత్రి ఏఎన్నార్‌తో నటించడానికి భయపడింది.

మొదట్లో ఆమె సరిగా చేయడం లేదని సినిమాల నుంచి కూడా తీసేశారు. అలానే ఏఎన్నార్‌ కూడా భయపడ్డాడు. ఓ హీరోయిన్‌తో వర్క్ చేయడానికి ఆయన వణికిపోయాడు. ఆమె భుజంపై చేయడానికి వణికిపోయాడట. మరి ఆ హీరోయిన్‌ ఎవరు? ఆ కథేంటి? అనేది చూస్తే, 
 


ఏఎన్నార్‌ సినిమాల్లోకి రాకముందే చాలా మంది నటులు సినిమాలు చేస్తున్నారు. భానుమతి కూడా ఏఎన్నార్‌ కంటే పెద్దదే. ఏజ్‌లోనూ, నటన పరంగానూ పెద్దది. ఆమె అంటే అందరికి హడల్‌. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ లు సైతం ఆమె వద్ద తగ్గి ఉండేవారట. అంతటి డామినేషన్‌ చూపించేదట. అయితే ఏఎన్నార్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమెతో పనిచేయాలంటే భయపడిపోయేవాడట.

ఓ సినిమాలో నటించే సమయంలో టెన్షన్‌ పడ్డట్టు తెలిపారు ఏఎన్నార్‌. పాట చిత్రీకరించే సమయంలో భుజంపై చేసే సీన్ లో వణికిపోయాడట. సరిగా వేయి అని ఆమెనే గద్దాయించిందట. తన చీరకొంగు, రవికే(బ్లౌజ్‌) మెరుపులు మెరిసేలా ఉందని, అది గుచ్చుకునేలా ఉండేదట. ఓ వైపు ఆమెతో యాక్ట్ చేయాలంటే భయం, మరోవైపు చీర కంఫర్ట్ గా లేదు. చాలా ఇబ్బంది పడ్డాడట ఏఎన్నార్‌. 
 

ఆ భయంతో చేయి వణికిపోతుంటే, దాన్ని కవర్ చేయడానికి మేడం ఇది(చీర) గుచ్చుకుంటుందన్నాడట. అది అలానే ఉంటుంది వేయ్యవోయ్‌ హీరో, నాతో సరసం ఆడుతున్నావని అన్నదట. సరసం కాదు మేడం, మీ భుజం మీద చేయి వేయాలంటే భయం భయంగా ఉందని చెప్పాడట. దీంతో అక్కినేని భయం పోగొట్టడం కోసం మరుసటి రోజు ఏం చేసిందంటే..

`16ఎంఎం కెమెరా ఒకటి కోనిచ్చి, జడ్జీ కోట, మహాభళిపురం, ఎల్లూరు ఇలాంటి చోట్లకి దద్దోజనం, పులిహోర కలిపి తీసుకొని తన కారులో ఎక్కించుకుని ఈ ప్రదేశాలన్నింటికి తిప్పించింది. ఇద్దరం చేతులు పట్టుకుని పరిగెత్తడం, మీద నీళ్లు చల్లమనడం, చేట్లు ఎక్కించడం ఇలా సరదాగా ఆడిపించి ఇంటిమసీ క్రియేట్‌ చేసింది. నన్ను ఫ్రీ చేసింది. యాక్ట్ చేయడానికి కంఫర్ట్ నెస్‌ కోసం ఇంతగా చేసింది.

నాకు తెలిసి ఇలా మరెవరూ చేసి ఉండరు` అని తెలిపారు ఏఎన్నార్‌. అంతేకాదు డైలాగులు ఎలా చెప్పాలో కూడా నేర్పించిందట. ఆ టైమ్‌లో తనని ఏరా అనే వాళ్లు ఉన్నారు కానీ, నేను ఏరా అనేవాళ్లు ఎవరూ లేరని, అంతా సీనియర్లే అని, చాలా సమర్థులు అని తెలిపారు ఏఎన్నార్. 
 

జయప్రదతో `జయప్రదం` అనే టాక్‌ షోలో పాల్గొన్న ఏఎన్నార్‌ ఈ విషయాలను పంచుకున్నారు. ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఏఎన్నార్‌, భనుమతి కలిసి `లైలా మజ్ను`, `తాతమ్మ కల`, `బొబ్బిలి యుద్ధం`, `బాటసారి`, `అంతస్తులు`, `రత్నమాల`, `రక్షరేఖ`, `ప్రేమ`, `విప్రనారాయణ`, `చక్రపాణి` ఇలా అనేక సినిమాలు చేసి మెప్పించారు.

ఏడు దశాబ్దాల కెరీర్‌లో ఏఎన్నార్‌ 255కిపైగా సినిమాలు చేసి మెప్పించారు ఏఎన్నారు. అలుపెరగని బాటసారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చివరగా `మనం` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. క్లాసికల్‌ మూవీగా నిలిచింది. 

హీరో అని కూడా చూడకుండా మెగాస్టార్‌ని రోజంతా ఎండలో నిల్చోబెట్టిన నిర్మాత, చిరు ఆ రోజే డిసైడ్‌ అయ్యాడు
 

Latest Videos

click me!