ప్రస్తుతం సోనియా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ యాంకర్ శివ సోనియాను ఇంటర్వ్యూ చేశాడు. నిఖిల్ సిగరెట్లు మానేస్తే ఏదైనా ఇస్తాను అన్నావ్? అసలు ఏమి ఇచ్చే దానివి? అని యాంకర్ శివ అడిగాడు. ఆ ప్రశ్నకు నవ్వేసిన సోనియా.. దాని వెనకున్న నేపథ్యం బయటపెట్టింది.
వాటర్, చాయ్... ఏది కావాలన్నా నేను పృథ్వి, నిఖిల్ లను అడుగుతూ ఉంటాను. చాయ్ మాత్రం నిఖిల్ ని అడుగుతాను. ఎందుకంటే నిఖిల్ చాయ్ బాగా చేస్తాడు. ఒకరోజు నన్ను వాటర్ తెమ్మని నిఖిల్ అడిగాడు. నేను లేజీగా ఉండి, తెచ్చుకో పోరా అన్నాను. అదే పృథ్వి అడిగితే వెంటనే వెళ్లి తెచ్చేదానివి, నేను అడిగితే మాత్రం చేయవు.. అన్నాడు.