మొగల్తూరు మొనగాళ్లు కృష్ణంరాజు, చిరంజీవి చివరగా నటించిన మూవీ.. ఒకే ఏడాది 13 చిత్రాలు, రికార్డ్ అంటే ఇదీ

First Published Oct 9, 2024, 10:19 AM IST

మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మార్చేసిన ఏడాది 1983. ఈ ఏడాది చిరంజీవి కెరీర్ లో చాలా అద్భుతాలు, అరుదైన సంఘటనలు జరిగాయి. చిరంజీవికి అత్యధిక చిత్రాల్లో నటించింది ఈ ఏడాదిలోనే. 

మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మార్చేసిన ఏడాది 1983. ఈ ఏడాది చిరంజీవి కెరీర్ లో చాలా అద్భుతాలు, అరుదైన సంఘటనలు జరిగాయి. చిరంజీవికి అత్యధిక చిత్రాల్లో నటించింది ఈ ఏడాదిలోనే. ఏకంగా 13 చిత్రాల్లో నటించారు. మరో చిత్రంలో  అతిథి పాత్రలో నటించారు. 

ఈ ఏడాది చిరంజీవి మొదటగా నటించిన చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ నిలిచింది. పల్లెటూరి మొనగాడు. ప్రేమ పిచ్చోళ్ళు, అభిలాష, ఆలయ శిఖరం, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి, గూఢచారి నెంబర్ 1, మగమహారాజు, రోషగాడు, సింహపురి సింహం, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ ఇలా మొత్తం 13 చిత్రాల్లో నటించారు. ఇక తన స్నేహితుడు ప్రసాద్ బాబు కోరిక మేరకు ఇదే ఏడాది మా ఇంటి ప్రేమాయణం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. 

Latest Videos


వీటిలో ప్రేమ పిచ్చోళ్ళు, ఆలయ శిఖరం, పులి బెబ్బులి, రోషగాడు చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. శివుడు శివుడు శివుడు, సింహపురి సింహం ఈ రెండు మాత్రమే ఫ్లాపులు. మిగిలినవన్నీ హిట్స్. వీటిలో అభిలాష, మగమహారాజు చిత్రాలు సూపర్ హిట్ కాగా, ఖైదీ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చిరంజీవి కెరీర్ ని మార్చేసింది. చిరంజీవి, రావు గోపాల్ రావు కాంబినేషన్ కి క్రేజ్ వచ్చింది ఈ ఏడాది లోనే. అభిలాష చిత్రంలో వీళ్లిద్దరి నటన హైలైట్. 

ఇక చిరంజీవి తన మిత్రుడు.. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో చివరగా కలసి నటించింది కూడా ఈ ఏడాదే. పులి బెబ్బులి చిత్రంలో చిరు, కృష్ణం రాజు హీరోలుగా నటించారు. వీళ్ళిద్దరూ మొగల్తూరు నుంచి వచ్చి టాలీవుడ్ లో అగ్ర నటులుగా ఎదిగినవారే. చిరంజీవివి చివరగా నటించిన మల్టీస్టారర్ చిత్రం కూడా ఇదే. 

చిరంజీవి నటన, డ్యాన్సులు, ఫైట్స్ గురించి ఈ ఏడాది ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. టాలీవుడ్ లో కొత్త సూపర్ స్టార్ అవతరించారు అని అంతా భావించారు. యువత మొత్తం చిరంజీవి జపం మొదలు పెట్టారు. 13 చిత్రాల్లో ఒకే ఏడాది నటించి కేవలం 2 ఫ్లాపులు మాత్రమే పొందడం కూడా చిరంజీవి కెరీర్ లో అరుదైన రికార్డు. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన రికార్డు మాత్రం సూపర్ స్టార్ కృష్ణ పేరుపై ఉంది. 

click me!