నాగవంశీ మామూలోడు కాదుగా, రిషబ్ శెట్టికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడో తెలుసా.. అస్సలు ఊహించలేరు

Published : Aug 03, 2025, 08:00 AM IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించే పాన్‌ ఇండియా పీరియడ్‌ డ్రామాకు రిషబ్ శెట్టి అందుకునే రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నాగవంశీ ఊహకందని విధంగా భారీ రెమ్యునరేషన్ రిషబ్ శెట్టికి అందిస్తున్నారు. 

PREV
15
తెలుగులో రిషబ్ శెట్టి మరో చిత్రం

నేషనల్ అవార్డు విజేత, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తాజాగా మరో పాన్‌ ఇండియా చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ భారీ పీరియడ్ డ్రామాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పేరు ఖరారు కానీ ఈ చిత్రం 18వ శతాబ్దం బెంగాల్‌ను నేపథ్యంగా చేసుకుని తెరకెక్కనుంది. ‘జై హనుమాన్’ తర్వాత ఇది రిషబ్ శెట్టికి తెలుగులో రెండో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానుంది.

DID YOU KNOW ?
రిషబ్ శెట్టి అసలు పేరు
రిషబ్ శెట్టికి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. న్యూమరాలజీ ప్రకారం, కెరీర్ లో ఎదుగుదల కోసం మిత్రుల సలహాతో “రిషబ్”గా పేరు మార్చుకున్నారు.
25
రిషబ్ శెట్టికి మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్

ఇటీవల టాలీవుడ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, రిషబ్ శెట్టికి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేందుకు నిర్మాత నాగ వంశీ రూ.55 కోట్లు రెమ్యునరేషన్‌గా ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇది రిషబ్ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం కాగా, ఆయన కన్నడ చిత్రాల్లో ఇప్పటివరకు పొందిన రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

35
కాంతార ఫస్ట్ పార్ట్ కి రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

గతంలో రిషబ్ శెట్టి ‘కాంతారా’ చిత్రానికి దర్శకత్వం వహించి నటించడంతో పాటు, కేవలం రూ.2 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, ‘కాంతారా’ ప్రీక్వెల్ కోసం ఆయన రెమ్యునరేషన్ రూ.12 కోట్లకు పెరిగింది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి అందుతున్న రూ.55 కోట్లు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలవనుంది.

45
పెరుగుతున్న రిషబ్ శెట్టి క్రేజ్

ఈ భారీ మొత్తంతో రిషబ్ శెట్టి అత్యధిక పారితోషికం అందుకుంటున్న కన్నడ నటుల్లో ఒకరిగా నిలిచారు. ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ప్రస్తుతానికి ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.క్రమంగా రిషబ్ శెట్టి క్రేజీ స్టార్ గా మారిపోతున్నారు.  కాంతార ప్రీక్వెల్ తర్వాత రిషబ్ శెట్టి క్రేజ్ ఇంకా ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. 

55
కాంతార సృష్టించిన సంచలనం

కాంతార చిత్రం మూడేళ్ళ క్రితం విడుదలై వరల్డ్ వైడ్ గా 300 కోట్లు రాబట్టింది. కాంతార తర్వాత సౌత్ లో రిషబ్ శెట్టి తిరుగులేని హీరోగా అవతరించారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో జై హనుమాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి మరో తెలుగు చిత్రం కంఫర్మ్ అయింది. మొత్తంగా టాలీవుడ్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ సంచలంగా మారారు. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన నిర్మాణంలో వస్తున్నాయి. ఇప్పుడు రిషబ్ శెట్టికి నాగవంశీ 55 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్.

Read more Photos on
click me!

Recommended Stories