సావిత్రి, అంజలిదేవిల తర్వాత ఏఎన్నార్‌ అత్యధిక సినిమాలు చేసింది ఎవరితోనే తెలుసా? హీరోయిన్‌ అస్సలే కాదు

Published : Jun 10, 2025, 03:11 PM IST

అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్‌లో సావిత్రి, అంజలిదేవితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువ మూవీస్‌ చేసింది హీరోయిన్లతో కాదు.

PREV
16
ఎన్టీఆర్‌ కి దీటుగా నిలబడ్డ ఏఎన్నార్

ఏఎన్నార్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో అలుపెరగని బాటసారిగా రాణించారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు నటుడిగా రాణించారు. తొలితరం నటుడిగా ఆయన ఎన్నో అద్బుతమైన చిత్రాలు చేశారు. పౌరాణికాలతో ఎన్టీఆర్‌ దూసుకుపోతుంటే, ఆయనకు దీటుగా సాంఘీక, జానపద చిత్రాలతో రాణించారు. ముఖ్యంగా ప్రేమ కథలతో బాగా పాపులర్‌ అయ్యారు ఏఎన్నార్‌.

26
80 మంది హీరోయిన్లతో నటించిన ఏఎన్నార్‌

ఏఎన్నార్‌ 255కిపైగా చిత్రాల్లో నటించారు. ఇందులో 80 మందికిపైగా హీరోయిన్లతో కలిసి నటించారట. వారిలో ఎక్కువగా సావిత్రితో, అలాగే అంజలిదేవితో సినిమాలు చేసినట్టు తెలిపారు ఏఎన్నార్‌. అయితే ఆ తర్వాత ఎక్కువగా సినిమా సినిమాలు చేసింది హీరోయిన్లతో కాదు, ఓ హీరోతో కావడం విశేషం.

36
సావిత్రి, అంజలిదేవి తర్వాత ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు

ఏఎన్నార్‌ ఎక్కువగా సినిమాలు చేసిన హీరో ఎవరో కాదు, ఎన్టీఆర్‌. సావిత్రి, అంజలిదేవి తర్వాత అత్యధిక చిత్రాలు రామారావుతో కలిసి నటించారట. వీరిద్దరు కలిసి 15కిపైగా చిత్రాల్లో నటించారట. నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధించాయి. ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. ఇప్పటికీ క్లాసిక్‌ గా నిలిచాయి.

46
రామారావుతో 15 సినిమాలు

తెలుగు చిత్ర పరిశ్రమకి క్రమశిక్షణ నేర్పింది తాను, ఎన్టీఆర్‌ మాత్రమే అని తెలిపారు నాగేశ్వరరావు. ఓ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సావిత్రి, అంజలి దేవి తర్వాత ఎక్కువగా రామారావుతోనే పనిచేశానని, ఇద్దరం కలిసి 15 సినిమాలు చేశామని, అవన్నీ మంచి చిత్రాలుగా నిలిచిపోయాయని తెలిపారు. 

56
ఎన్టీఆర్‌ని మిస్‌ అవుతున్నా అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

అయితే తమ మధ్య ఎన్ని పొరపచ్చాలున్నా, తమ అనుబంధం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందని, ఈ సమయంలో(ఆ సమయంలో) రామారావు లేకపోవడం బాధగా అనిపిస్తుందన్నారు అక్కినేని. ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్‌ కావడం విశేషం.

66
ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కాంబినేషన్‌లో సినిమాలు

ఇక ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు కలిసి `మాయాబజార్`, `గుండమ్మ కథ`, `భూకైలాస్‌`, `సంసారం`, `శ్రీకృష్ణార్జున యుద్ధం`, `చాణక్య చంద్రగుప్త`, `పల్లెటూరి పిల్లా`, `రామకృష్ణులు`, `సత్యం శివం`, `చరణదాసి`, `మిస్సమ్మ`, `రామదాసు`, `తెనాలి రామకృష్ణ`, `పరివర్తన`, `భక్త రామదాసు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లోనే మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్‌కి తెరలేపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories