రాఖీసావంత్‌కి ముద్దు, డాక్టర్‌కి చెంప దెబ్బ.. స్టార్‌ సింగర్‌ మీకా సింగ్‌ జీవితంలో మతిపోయే వివాదాలు

Published : Jun 10, 2025, 12:30 PM ISTUpdated : Jun 10, 2025, 12:36 PM IST

బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు మీకా సింగ్ వయసు 48 సంవత్సరాలు. 1977లో దుర్గాపూర్‌లో జన్మించిన మీకా తన అద్భుతమైన గొంతుతో అలరించడంతోపాటు పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. 

PREV
17
మీకా సింగ్‌ జీవితంలోని వివాదాలు

బాలీవుడ్ గాయకుడు, ర్యాపర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌, నటుడు మీకా సింగ్ లైఫ్‌లో చాలా వివాదాలున్నాయి. అనేక కేసులు, జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన వివాదాల గురించి తెలుసుకుందాం.

27
రాఖీ సావంత్‌కి బలవంతంగా ముద్దు

2006లో ఒక పార్టీలో రాఖీ సావంత్‌ను బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు మీకా. దీనిపై రాఖీ కేసు పెట్టారు. అయితే, తర్వాత ఇద్దరూ రాజీపడ్డారు.

37
ఆటోని ఢీ కొట్టిన మీకా సింగ్‌ కారు

2011లో హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నారు మీకా. ఆయన కారు ఆటోను ఢీకొట్టిందని ఆరోపణ. అయితే, ఆ సమయంలో తాను డ్రైవింగ్ చేయలేదని మీకా తోసిపుచ్చారు.

47
మీకా సింగ్‌ ఫామ్‌ హౌజ్‌ సీజ్‌

2013లో మీకా ఫామ్‌హౌస్‌ను పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కింద సీజ్ చేశారు.

57
డాక్టర్‌ని కొట్టిన మీకా సింగ్‌

2015లో ఓ కార్యక్రమంలో డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టారు మీకా. దీంతో ఆ డాక్టర్ చెవిపోటుకు గురయ్యారు.

67
లైంగిక వేధింపుల కేసు

2018లో బ్రెజిల్ మోడల్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో దుబాయ్‌లో అరెస్టయ్యారు మీకా. తర్వాత విడుదలయ్యారు.

77
మీకాపై నిషేధం డిమాండ్‌

2019లో పాకిస్థాన్‌లో ప్రదర్శన ఇచ్చినందుకు మీకాపై నిషేధం విధించాలని డిమాండ్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన చాలా అగ్రిమెంట్స్ క్యాన్సిల్‌ అయ్యాయి. ప్రాజెక్ట్ లు పోయాయి. 

ఇలాంటి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన సింగర్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాది మంది శ్రోతలను అలరించారు. ఆయనకు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. వివాదాలే కాదు, సింగర్‌గానూ స్టార్‌గా రాణిస్తున్న ఆయన నేడు మంగళవారం 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories