కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్లతో రొమాన్స్ చేయాలంటే ఏఎన్నార్ భయపడేవారట. దీనితో ఓ హీరోయిన్ ఆయన్ని కారులో తీసుకెళ్లి రొమాన్స్ నేర్పించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో రొమాంటిక్, ట్రాజెడీ చిత్రాలకు కింగ్. అందుకే అప్పట్లో ఏఎన్నార్ కి మహిళల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. హీరోయిన్లతో రొమాన్స్ పండించాలంటే ఏఎన్నార్ కి మాత్రమే సాధ్యం అయ్యేది. కానీ కెరీర్ బిగినింగ్ లో ఏఎన్నార్ కూడా రొమాన్స్ అంటే చాలా భయపడేవారట. ఈ విషయాన్ని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
DID YOU KNOW ?
అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా
ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ 1976లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభం అయింది.
25
హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడ్డ ఏఎన్నార్
కనీసం హీరోయిన్ భుజం మీద చేయి వేయాలన్నా చాలా బయపడేవారట. హీరోయిన్ భానుమతి గారు నాకంటే సీనియర్. ఆమెతో నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అనుకునేవాళ్లం. ఒక చిత్రంలో ఆమెతో నటించే ఛాన్స్ వచ్చింది. ఆమె తళుకు బెళుకులు ఉండే జాకెట్ వేసుకున్నారు. ఆమె భుజంపై చేయి వేయాలన్నా భయంగా అనిపించేది. మీ జాకెట్ నా చేతికి గుచ్చుకుంటోంది అని చెప్పా.
35
ఏఎన్నార్ కి ఆమె రొమాన్స్ ఎలా నేర్పించింది అంటే..
అది అలాగే ఉంటుంది హీరో, నువ్వు ఊరికే సరసం ఆడుతున్నావ్ అని ఆమె సరదాగా అన్నారు. సరసం కాదు మేడం నాకు నిజంగానే మీ భుజంపై చేయి వేయాలంటే భయంగా ఉంది అని చెప్పా. దీనితో సరిగ్గా నటించేవాడిని కాదు. దీనితో ఆమె స్వయంగా తన కారులో నన్ను మహాబలిపురం తీసుకుని వెళ్లారు. ఒక కెమెరా కొనిచ్చారు. ఆ కెమెరాతో షూట్ చేస్తూ నన్ను హీరోయిన్ వెంట పడుతున్నట్లు బీచ్ లో పరిగెత్తమనే వారు.
ఆమె నా చేయి పట్టుకుని పరిగెత్తడం నేర్పించింది. రొమాంటిక్ గా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లడం లాంటివి అలవాటు చేసింది. ఆ విధంగా ఇంటిమసీ క్రియేట్ చేసి నా భయం పోగొట్టింది. భానుమతి లాంటి సీనియర్లే నన్ను నటుడిగా తీర్చి దిద్దారు అని ఏఎన్నార్ గుర్తు చేసుకున్నారు.
55
సావిత్రికి కూడా అదే భయం
నా తర్వాత వచ్చిన సావిత్రి, ఇతర నటీనటులు కూడా భయపడేవారు వాళ్ళని నేను గైడ్ చేశాను. చాలా మంది హీరోయిన్లు నాతో, ఎన్టీఆర్ తో నటించాలంటే మొదట్లో భయపడేవారు. కానీ మీకు జోవియల్ గా ఉండడం చూసి వాళ్లలో భయం పోయేది అని ఏఎన్నార్ తెలిపారు.