
దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవల `కుబేర` చిత్రంతో హిట్ కొట్టాడు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మంచి వసూళ్లని రాబట్టింది.
వంద కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. కాకపోతే బయ్యర్లకి మాత్రం లాభాలను తీసుకురాలేకపోయింది. అదే సమయంలో తమిళంలోనూ ఈ సినిమా ఫెయిల్ అయ్యింది.
దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన మార్క్ కథలతో జనాలకు మంచి సినిమాలను అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండే శేఖర్ కమ్ములపై ఓ రూమర్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఆయన స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి. దీనికి ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే సోలో దీనిపై స్పందించారు. ఆ కథేంటో చూస్తే,
శేఖర్ కమ్ముల 2000లో `డాలర్ డ్రీమ్స్` అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత `ఆనంద్` మూవీతో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజా, కమలినీ ముఖర్జీ ఇందులో జంటగా నటించారు.
ఒక కాఫీ లాంటి మూవీగా ఇది విశేష ఆదరణ పొందింది. థియేటర్లలో కంటే టీవీల్లో బాగా ఆడింది. ఇప్పటికీ చూసినా ఈ మూవీ ఆకట్టుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
ఈ సినిమాతోపాటు కమలినీ ముఖర్జీని `గోదావరి`, `హ్యాపీడేస్` చిత్రాల్లో రిపీట్ చేశారు శేఖర్ కమ్ముల. వరుసగా ఆమెతో మూడు సినిమాలు చేశారు.
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ములకు, కమలినీ ముఖర్జీకి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, హీరోయిన్ ప్రేమలో శేఖర్ పడ్డారనే పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రాధాకృష్ణ ప్రశ్నించారు.
దీనికి శేఖర్ కమ్ముల స్పందించారు. అదేం లేదని తెలిపారు. తాను అలవాటైన వారితో కంటిన్యూగా పనిచేస్తానని, టెక్నీషియన్లు అందరినీ రిపీట్ చేశానని తెలిపారు.
అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి, కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలా మందిని రిపీట్ చేశాను. అలానే కమలినీ ముఖర్జీని రిపీట్ చేశాను, కానీ వాళ్లు ఎవరూ మీడియాకి, జనాలకు తెలియదు, కేవలం హీరోయిన్ మాత్రమే తెలుస్తుంది. అందుకే ఆ రూమర్స్ వస్తుంటాయి` అని అన్నారు.
`హ్యాపీడేస్` మూవీలో ఆమె పాత్రకి ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా ఆర్కే ప్రశ్నించగా, అది పారితోషికానికి సంబంధించిన మ్యాటర్ అని. వేరే హీరోయిన్లని తీసుకుంటే ఎక్కువ పారితోషికం అవుతుందని, కమలినీ తమ బడ్జెట్‌లో వచ్చిందన్నారు.
అంతేకానీ అందులో మరో కోణం లేదని, ఆ రూమర్‌లో ఏమాత్రం వాస్తవం లేదని, తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని శేఖర్ కమ్ముల చెప్పడం విశేషం. దాదా ఆరేడు ఏళ్ల క్రితం నాటి ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ కావడం విశేషం.