మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రం రూపొందుతోంది. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. చివరగా చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది.
25
విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్
ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలసి బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మౌని రాయ్ నటిస్తోంది. డైరెక్టర్ వశిష్ఠ విజువల్ ట్రీట్ అనిపించేలా ఈ సాంగ్ ని చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి విషయంలో విశ్వంభర చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
35
కీరవాణికి అవమానం జరిగిందా ?
మౌని రాయ్ నటించిన స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేసింది కీరవాణి కాదు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రానికి మరో సంగీత దర్శకుడితో స్పెషల్ సాంగ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కీరవాణి గారిని అవమానించడమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై డైరెక్టర్ వశిష్ఠ స్పందించారు. విమర్శలకు సరైన విధంగా సమాధానం ఇచ్చారు. స్పెషల్ సాంగ్ ని మరో మ్యూజిక్ డైరెక్టర్ చేయించమని కీరవాణిగారే తమకి చెప్పినట్లు వశిష్ఠ పేర్కొన్నారు. విశ్వంభర మూవీ స్పెషల్ సాంగ్ రికార్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు కీరవాణి గారు హరిహర వీరమల్లు చిత్రంతో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు.
55
కీరవాణి గారే చెప్పారు
దీనితో ఆయనే స్పెషల్ సాంగ్ మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించండి అని చెప్పారు. అదేంటి సార్ అని అడిగితే.. అందులో తప్పు లేదు. ఒక చిత్రానికి కొన్ని పాటలని ఒక రచయితతో మరికొన్ని పాటలని మరో రచయితతో రాయించుకుంటున్నాం కదా.. ఇది కూడా అంతే అని అన్నారు. మన దగ్గర సమయం లేనప్పుడు అలా చేయడంలో తప్పు లేదు అని తెలిపారు. అందుకే భీమ్స్ తో స్పెషల్ సాంగ్ చేయించినట్లు వశిష్ఠ పేర్కొన్నారు.