అప్పుడు విష్ణు, సరే కడుపుతో ఉన్నావు కాబట్టి నా నుంచి నీకు గాజులు బహుమతిగా ఇస్తాను లే అని అంటాడు.దానికి మల్లికా ఎంతో సంతోషపడి ఇప్పుడు మీరు పడుకోండి అని చెప్పి కాలు పడుతుంది. ఆ తర్వాత సీన్లో జెస్సి జానకి కు ఫోన్ చేసి అక్క నేను నీకు చెప్పిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా అని అడగగా ఇది ఇంత తొందరగా తేలిపోయే విషయం కాదు జెస్సి, మీరు తొందరపడి చేసిన తప్పు కి అర్థవంతమైన జీవితం ఇవ్వాలంటే సమయం పడుతుంది అని అంటాది. పక్క నుంచి మాటలన్నీ వింటున్న అఖిల్ జెస్సీ వదినకి అంత చెప్పేసినట్టు ఉంది అని అనుకుంటాడు.