Samantha: ట్రైలర్ చూసి సమంత మూవీ జాతకం చెప్పేసిన అఖిల్, మా ఇంటి బంగారంపై షాకింగ్ కామెంట్స్

Published : Jul 03, 2026, 12:05 PM IST

సమంత మా ఇంటి బంగారం మూవీపై అఖిల్ అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూడకపోయినా కేవలం ట్రైలర్ చూసి జాతకం చెప్పేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Samantha

అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం జూలై 10న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అఖిల్ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనితో అఖిల్ ఒక్క హిట్ కొడితే చూసి మురిసిపోవాలని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిలోనే అఖిల్ కనిపిస్తున్నాడు.

25
లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ బిజీ

లెనిన్ చిత్రం మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా క్రేజీ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. లెనిన్ మూవీ చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో అఖిల్ బిజీగా ఉన్నారు. అఖిల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ వదిన సమంత మా ఇంటి బంగారం మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
సమంత మూవీ చూడలేదు కానీ

మా ఇంటి బంగారం మూవీ చూశారా అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం లెనిన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వల్ల చూడలేదు అని సమాధానం ఇచ్చారు. కానీ ట్రైలర్ చూశాను. ఆ వైబ్ అద్భుతంగా ఉంది. ఆ మూవీ అంత గా ఆడింది అంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు.

45
మా ఇంటి బంగారంపై అఖిల్ ప్రశంసలు

మా ఇంటి బంగారం అనే టైటిల్ పెట్టుకుని అలాంటి యాక్షన్ ని ఒక ఫిమేల్ క్యారెక్టర్ తో చేయించడం సూపర్బ్ అనే చెప్పాలి. సామ్ కమాండబుల్ జాబ్ చేసింది అంటూ అఖిల్ ప్రశంసలు కురిపించారు.

55
నందిని రెడ్డి దర్శకత్వం

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories