Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్

Published : Jul 03, 2026, 10:35 AM IST

Karthika Deepam 2 Today Episode (జూలై 3వ తేదీ)లో ఒకరిపై ఒకరు రివేంజ్ తీర్చుకున్న సూరజ్, జ్యో. ఆఫీసులోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన దక్షిణ మూర్తి. శివన్నారాయణకు పోటీగా రెస్టారెంట్స్. సూరజ్ పై శివన్నారాయణ డౌట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో సూరజ్ స్కూటీపై రివర్స్ లో కూర్చొని వెళ్తుంటుంది జ్యోత్స్న. సరిగ్గా కూర్చోవచ్చు కదా అంటాడు సూరజ్. నీకు ఇబ్బందిగా ఉందా అని వెటకారంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. నీ దగ్గర ఇప్పుడు శివన్నారాయణ మనుమరాలు అనే పేరు తప్పా ఇంకా ఏం లేదు. నేను ఎలా నడిపినా నీకు నా స్కూటీ తప్ప వేరే ఆప్షన్ లేదు అంటాడు సూరజ్. ఆ తర్వాత నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు అని కార్తీక్ ని వదిలేసే విషయం గురించి మాట్లాడతాడు సూరజ్.

నా పర్సనల్ విషయాలు నీకు అప్డేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అంటుంది జ్యోత్స్న. సూరజ్, జ్యోలను చూసి ఓ వ్యక్తి ఏంటీ మొగుడు పెళ్లాల గొడవా? నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు మాట్లాడమంటావా అని కామెంట్ చేసి వెళ్లిపోతాడు. నాకు దాహంగా ఉందని స్కూటీ ఆపించి సూరజ్ ను వాటర్ బాటిల్ తెమ్మని పంపిస్తుంది. ఆ గ్యాప్ లో టైర్ పంక్చర్ చేస్తుంది. ఆ తర్వాత సూరజ్ జ్యోను వెనకాల కూర్చోబెట్టుకుని స్కూటీని తోసుకుంటూ వెళ్తాడు.

25
సూరజ్ రివేంజ్

మరోవైపు ఆఫీసులో దీప ముందు చాలా ఫైల్స్ పెడతాడు కార్తీక్. బావ ఏంటి ఇవన్నీ అని అడుగుతుంది దీప. ఇవన్నీ చెక్ చేయాలి అంటాడు కార్తీక్. వామ్మో నా వల్ల కాదు, నేను చేయలేను అంటుంది దీప. ఎవరితో ఏం చేయించాలో నాకు తెలుసు దీప అంటాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న, సూరజ్ ఆఫీసుకు వస్తారు. రూ.500 నోటు తీసి సూరజ్ చేతిలో పెట్టి నువ్వు పడిన కష్టానికి కూలీ అనుకో అని పొగరుగా చెప్పి వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న బ్యాగులో నుంచి లిప్ స్టిక్ కింద పడుతుంది. దాన్ని తీసుకొని జ్యోపై రివేంజ్ ప్లాన్ చేస్తాడు సూరజ్.

35
జ్యోను ఆటపట్టించిన కార్తీక్

జ్యోత్స్న లోపలికి వెళ్లి తన సీటులో కూర్చొంటుంది. సూరజ్ కూడా కార్తీక్ తో మాట్లాడి వెళ్తుండగా తన షర్ట్ వెనుకాల ఉన్న లిప్స్ మార్క్ ను చూస్తాడు కార్తీక్. దీపకు కూడా చూపిస్తాడు. జ్యోత్స్న దగ్గరికి వెళ్లి మా ముందు మీరిద్దరూ కొట్టుకున్నట్లు యాక్ట్ చేసి చాటుగా ఒకటైపోతారా? అప్పుడే ముద్దుల దాకా వెళ్లిపోయారా? అని జ్యోత్స్నను ఆటపట్టిస్తాడు కార్తీక్. సూరజ్ కూడా సిగ్గుపడతాడు. కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఆ తర్వాత సూరజ్ లిప్ స్టిక్, రూ. 500 నోటును జ్యోత్స్న చేతిలో పెడతాడు. అప్పుడు జ్యోత్స్నకు విషయం అర్థం అవుతుంది.

45
దక్షిణమూర్తి ఎంట్రీ

కాసేపటికి జ్యోత్స్న దగ్గరికి ఫైల్ తీసుకొని వస్తుంది దీప. అప్పుడే దక్షిణ మూర్తి ఎంట్రీ ఇస్తాడు. ఎందుకు వచ్చారు అని అడిగితే నా మనుమరాలి కోసం అని చెబుతాడు. మీరు నాకోసమే వస్తే దయచేసి వెళ్లిపోండి అంటుంది జ్యోత్స్న. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావ్. నువ్వు సీఈఓ గదిలో కదా ఉండాల్సింది అంటాడు దక్షిణమూర్తి. సీఈఓ దీప అనే విషయం తెలుసుకొని.. ఆ శివన్నారాయణ నీకు కూడా అన్యాయం చేశాడా అని అంటాడు. అప్పుడే ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అంటూ బయటకు వస్తాడు శివన్నారాయణ. ఆ తర్వాత ఇక్కడ వద్దు నా రూంలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని దక్షిణమూర్తిని లోపలికి తీసుకెళ్తాడు.

55
మాటల యుద్ధం

నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు మంచిగా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు అంటాడు శివన్నారాయణ. నీ బ్రాంచ్ లు ఎక్కడున్నాయో అక్కడ పోటీగా నేను బ్రాంచ్ లు ఏర్పాటు చేశాను. రేపే ఓపెనింగ్. నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని శివన్నారాయణకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు దక్షిణామూర్తి. నా బ్రాంచ్ లు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఇంత త్వరగా వీడికి ఎలా తెలిసింది. ఇక్కడ వీడి మనుషులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ బయటకు చూస్తాడు శివన్నారాయణ. అదే టైంలో దక్షిణమూర్తితో మాట్లాడుతుంటాడు సూరజ్. షాక్ అవుతాడు శివన్నారాయణ. దీప, కార్తీక్ కూడా చూస్తారు. సూరజ్ లోపలికి రాగానే నువ్వు దక్షిణ మూర్తి మనిషివా.. అని అడుగుతాడు శివన్నారాయణ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories