Lock Down : లాక్‌డౌన్ వాయిదా.. అనూహ్యమైన నిర్ణయం.. కొత్త డేట్‌ ఎప్పుడంటే?

Published : Dec 04, 2025, 05:15 PM IST

Lock Down Postponed: డిసెంబర్ 5న `లాక్‌డౌన్` అని ఇదివరకే ప్రకటించారు. అయితే, విడుదలకి కొన్ని రోజులే ఉండగా, సినిమా రిలీజ్‌ ని వాయిదా వేశారు. కొత్త డేట్‌ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది.  

PREV
14
లాక్‌ డౌన్‌ వాయిదా

లాక్‌డౌన్ అనే మాట వినగానే జనాల్లో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంది. దానికి ప్రధాన కారణం కరోనా లాక్‌డౌన్. కానీ మనం ఇప్పుడు చూడబోయేది 'లాక్‌డౌన్' సినిమా అప్‌డేట్. ఈ సినిమా కూడా కరోనా లాక్‌డౌన్ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తీశారు. ఇందులో నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో సినిమా విడుదలను వాయిదా వేశారు.

24
లాక్‌డౌన్‌ వాయిదా కారణం ఇదే

లాక్‌డౌన్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాదని చిత్రబృందం ప్రకటించింది. దానికి కారణం కూడా చెప్పింది. తమిళనాడులో వాతావరణం బాగోలేకపోవడం, భారీ వర్షాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు, త్వరలో కొత్త రిలీజ్ తేదీతో వస్తామని నిర్మాణ సంస్థ లైకా ప్రకటించింది.

34
క్రిస్మస్‌ కానుకగా `లాక్‌ డౌన్‌`?

లాక్‌డౌన్ వాయిదా ప్రకటన చేసినా, చిత్రబృందం కొత్త రిలీజ్ తేదీని చెప్పలేదు. వచ్చే వారం కార్తీ 'వా వాతియార్', ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. కాబట్టి, `లాక్‌డౌన్` సినిమా ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సెలవులకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై లైకా సంస్థ త్వరలో అధికారిక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.

44
నాలుగు సినిమాలతో మెప్పించిన అనుపమా పరమేశ్వరన్‌

లాక్‌డౌన్ సినిమాకు ఏ.ఆర్. జీవా దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమతో పాటు అభిరామి, రేవతి, మారన్ ముఖ్య పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్, ఎన్.ఆర్. రఘునందన్ సంగీతం అందించారు. శక్తివేల్ సినిమాటోగ్రఫీ, సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేశారు. ఈ ఏడాది అనుపమ నటించిన మూడో సినిమా ఇది. ఇంతకుముందు ఆమె నటించిన `డ్రాగన్`, `బైసన్`, `కిష్కింధపురి`, `పరదా` సినిమాలు చేసింది. వీటిలో `డ్రాగన్‌` బాగా ఆడింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories