అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Published : Dec 14, 2025, 09:37 AM IST

Akhanda 2 OTT Release : చాలా సమస్యలను అధిగమించి థియేటర్లలో సందడి చేస్తోంది బాలయ్య బ్లాస్టింగ్ మూవీ అఖండ 2. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? 

PREV
14
అఖండ 2 రిలీజ్

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో కొన్ని ప్రారంభ ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ యాక్షన్ సినిమా మొదట డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక వివాదాల వల్ల విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే, వారం ఆలస్యంగా అఖండా 2 థియేటర్లలో విడుదలైంది. ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై కూడా అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈసినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు?

24
ఓటీటీలో అఖండ 2'ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, 'అఖండ 2' మేకర్స్ దీని డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఫైనల్ చేశారట. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే కొంత మంది ఇచ్చిన సమాచారం ప్రకారం 'అఖండ 2' నాలుగు వారాల థియేటర్-టు-ఓటీటీ విండోను పాటిస్తుందని .. అలాంటప్పుడు, ఈ సినిమా 2026 జనవరి 9 నాటికి డిజిటల్‌ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే థియేటర రిలీజ్ ఒక వారం డిలే అవ్వడంతో.. ఓటీటీ రిలీజ్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈసినిమాను సంక్రాంతి వరకూ స్ట్రీమింగ్ చేసి.. గట్టిగా వ్యూస్ ను సాధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

34
అఖండ 2 స్టార్ కాస్ట్ ?

ఇక అఖండ 2' సినిమాలో బాలయ్య అఘోరాగా అద్భుతమైన నటన చూపించాడు. ఆయన పవర్ ఫుల్ యాక్టింగ్ , యాక్షన్ సీన్స్ కు అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. తనకు ఉన్న దివ్యశక్తితో చెడుపై పోరాడే పాత్ర బాలయ్యది. ఈ సీక్వెల్‌లో విలన్‌ గా ఆది పినిశెట్టి నటించి మెప్పించాడు. అతీంద్రియ శక్తులున్న ఒక రహస్యమైన వ్యక్తిగా ఆది కనిపించాడు. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత ఛటర్జీ లాంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. అయితే ఈమూవీ బాక్సాఫీస్ వసూళ్లు తగ్గుతుండటం మేకర్స్ ను, అభిమానులను కలవరపెడుతోంది.

44
డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య..

బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నాలుగు సినిమాలతో సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు సక్సెస్ అయితే డబుల్ హ్యాట్రిక్ ఆయన ఖాతాలో పడుతుంది. తాజాగా రిలీజ్ అయిన అఖండ 2 సక్సెస్ వైపు వెళ్తోంది.. బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రిజల్ట్ ను బట్టి.. బాలయ్య ఐదో సినిమా హిట్టా..ఫట్టా అనే విషయం తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అయితే.. మరో సినిమాతో బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ ను సాధించవచ్చు. త్వరలో మలినేని గోపీచంద్ తో తెరకెక్కించబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాలో బాలయ్య యోధుడిలా కనిపించబోతునట్టు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

Read more Photos on
click me!

Recommended Stories