Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే

Published : Dec 14, 2025, 08:22 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ షో 14వ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ ఆదివారం రెండో ఎలిమినేషన్‌ ఉండబోతుంది. 

PREV
15
ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9.. 14వ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అనే విషయం తెలిసిందే. నాగార్జున కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయ్యారు. ముందు నుంచి ఊహించినట్టుగానే ఆయన్ని ఎలిమినేట్‌ చేశారు నాగార్జున. ఈ వారం రెండో ఎలిమినేషన్‌ ఉంటుందని నాగార్జున ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో మరో ఎలిమినేషన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో.. దీనిపై క్లారిటీ వచ్చింది. ఆ రెండో కంటెస్టెంట్‌ ఎవరనేది కూడా తేలిపోయింది. ఊహించిన కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడారు.

25
భరణి ఎలిమినేట్‌

14వ వారం రెండో ఎలిమినేషన్‌లో భాగంగా భరణి ఎలిమినేట్‌ అయ్యారు. ఆయన ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ కూడా రాత్రినే కంప్లీట్‌ అయ్యిందట. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ని ఈ రోజు సాయంత్రం చూపించనున్నారు. అయితే భరణి ఎలిమినేషన్‌ అంతా ఊహించినదనే చెప్పొచ్చు. సుమన్‌ శెట్టి.. సంజనా ఎలిమినేట్‌ అవుతుందేమో అనుకున్నారు. కానీ భరణినే పంపించినట్టు సమాచారం. భరణి ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆరో వారమే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. కానీ బిగ్‌ బాస్‌ నిర్వాహకులు స్కెచ్‌ వేసి మళ్లీ తీసుకొచ్చారు.

35
నాగబాబు ఒత్తిడితో మళ్లీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి

నాగబాబు ఒత్తిడి మేరకు, పవన్‌ కళ్యాణ్‌ రికమండేషన్‌ మేరకు ఆయన్ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చినట్టుగా ఆ మధ్య దివ్వెల మాధురి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్‌లో నాగబాబు కూడా షోకి వచ్చి ఆమె వ్యాఖ్యలకు బలం చేకూర్చారు. అదే సమయంలో ఈ మధ్య నాగార్జున, నిహారికల మధ్య జరిగిన కన్వర్జేషన్‌ కూడా లీక్‌ అయ్యింది. ఇందులో నాగబాబు ఒత్తిడి మేరకు భరణిని ఉంచామని తెలిపారు. టాప్‌ 5లో ఉంచాలని చెప్పినట్టుగా వెల్లడించారు. కానీ అనూహ్యంగా 14వ వారమే ఎలిమినేట్‌ చేయడం ఆశ్చర్యంగా మారింది.

45
విమర్శలు వస్తాయనే భరణి ఎలిమినేషన్‌

నాగబాబు ఒత్తిడి మేరకు, నాగార్జున చెప్పిన దాన్ని ప్రకారం భరణి టాప్‌ 5లో ఉండాలి. కానీ ముందుగానే పంపించారు. అయితే దీనికి కారణం కూడా ఆ వీడియోనే అని తెలుస్తోంది. టాప్‌ 5లో ఉంచితే విమర్శలు వస్తాయని భావించిన నిర్వాహకులు భరణిని ఈ ఆదివారం ఎలిమినేట్‌ చేస్తున్నట్టు సమాచారం. దీంతో నాగబాబు చేసిన ప్రయత్నం కొంత వరకు ఫలించినా, చివరి నిమిషంలో బెడిసికొట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే భరణి రీఎంట్రీ తర్వాత కూడా ఏమాత్రం తన ఆటని చూపించలేకపోయారు. పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఒకటి రెండు సార్లు అరిచారు తప్ప, గొప్పగా ఆడలేదు. అదే సమయంలో ఒరిజినల్‌గా లేడనే విమర్శలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఆయన ఎలిమినేషన్‌కి కారణమని తెలుస్తోంది.

55
గ్రాండ్‌ ఫినాలేకి వెళ్లింది వీరే

ఇక సుమన్‌ శెట్టి, భరణి ఎలిమినేట్‌ కావడంతో టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరనేది కన్ఫమ్‌ అయ్యింది. ఇప్పటికే కళ్యాణ్‌ పడాల ఫైనల్‌కి చేరుకున్నారు. దీంతో   ఇమ్మాన్యుయెల్‌, తనూజ, సంజనా, డీమాన్‌ పవన్‌  హౌజ్‌లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేకి చేరుకుంటారు. ఈ సోమవారం నుంచి వీరికి సంబంధించిన స్వాగతం ఎపిసోడ్లు నిర్వహిస్తారు. వారి జర్నీలను కీర్తిస్తారు బిగ్‌ బాస్‌. ఇక ఈ ఐదుగురు మధ్య బిగ్‌ బాస్‌ టైటిల్‌ పోరు సాగబోతుంది. మరి వీరిలో ఎవరికి ఈ సారి బిగ్‌ బాస్‌ ట్రోఫీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్‌ ఇమ్మాన్యుయెల్‌ విన్నర్‌ అనేది ఫిక్స్ అయ్యిందట. మరి ఆయన్నే విన్నర్‌ని చేస్తారా? కామన్‌ మ్యాన్‌ కళ్యాణ్‌ పడాలని విన్నర్‌ని చేస్తారా? అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories