Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?

Published : Dec 14, 2025, 07:19 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 శనివారం ఎపిసోడ్‌లో సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మరి ఆయన 14 వారాలకుగానూ ఎంత పారితోషికం అందుకున్నాడనేది చూస్తే, ఆశ్చర్యం కలగక మానదు. 

PREV
15
నిజాయితీతో మనసులో దోచుకున్న సుమన్‌ శెట్టి

కమెడియన్‌ సుమన్‌ శెట్టి బిగ్‌ బాస్‌ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఆకట్టుకున్నాడు. సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వులు పూయించి ఎంతో మందికి అభిమాన హాస్యనటుడిగా మారారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోలో కూడా అదే తరహాలో నవ్వులు పూయించారు. బిగ్‌ బాస్‌ షోలో ఎంతో మంది హడావుడి చేస్తుంటారు. గొడవలకు దిగుతుంటారు. బాగా అరుస్తుంటారు. రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలా చేస్తేనే రాణించగలుగుతాం అని అనుకుంటారు. అలా చేస్తేనే ఫోకస్‌ అవుతామని భావిస్తుంటారు. అలా చేసి తన ఒరిజినాలిటీని పోగొట్టుకుంటారు.

25
సుమన్‌ శెట్టి ఎలిమినేషన్‌తో అభిమానులు నిరాశ

కానీ సుమన్‌ శెట్టి ఎప్పుడూ అలా చేయలేదు. తాను ఒరిజినల్‌గా ఉన్నాడు. నిజాయితీగా ఉన్నాడు. రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. అదే ఆయన సక్సెస్‌ గా చెప్పొచ్చు. తన ఇన్నోసెంట్‌ని ప్రజలకు నచ్చింది. అందుకే ఆయనకు ఓట్ వేసి ఇన్నాళ్లు నడిపిస్తూ వస్తున్నారు. నిజాయితీ ఆయన్ని 14 వారాలు ఉండేలా చేసింది. కానీ టాప్‌ 5లో ఉంటాడనుకున్న సుమన్‌ శెట్టి ముందుగానే ఎలిమినేట్‌ కావడంతో ఆయన అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. టాప్‌ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

35
సుమన్‌ శెట్టి పారితోషికం

ఇదిలా ఉంటే సుమన్‌ శెట్టి బిగ్‌ బాస్‌ షోకి వచ్చినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు, 14 వారాలకుగానూ ఎంత పారితోషికం అందుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్నారు సుమన్‌ శెట్టి. ఇంకా చెప్పాలంటే టాప్‌ 2 రేంజ్‌లో అందుకున్నట్టు సమాచారం. బిగ్‌ బాస్‌ షోలోకి వచ్చిన కంటెస్టెంట్లకి చాలా అరుదుగా మాత్రం యాభై వేల వరకు పారితోషికం ఇస్తారు. చాలా రేర్‌ కేసులో అంతకు మించి ఉంటుంది. అయితే సుమన్‌ శెట్టికి ఆ స్థాయిలో కాకపోయినా భారీగా పారితోషికం ఇచ్చారట.

45
అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకున్న సుమన్‌ శెట్టి

సుమన్‌ శెట్టికి రోజుకి రూ. 45వేల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి ఆయన రూ.315000 పారితోషికంగా అందుకున్నారు. 14 వారాలకు గానూ ఆయనకు దక్కిన పారితోషికం దాదాపు రూ.44 లక్షలు కావడం విశేషం. ఇంతటి పారితోషికం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ విన్నర్‌ ప్రైజ్‌ మనీ. బిగ్‌ బాస్‌ ట్రోఫీ విన్నర్‌ కి రూ.50లక్షలు ఇస్తారు. టాక్స్ లు కట్‌ అయితే ఆయనకు దక్కేది దాదాపు రూ.38 లక్షల వరకు ఉంటుంది. అదే మధ్యలో ఎవరైన సూట్‌ కేసు ఆఫర్‌కి టెంప్ట్ అయితే విన్నర్‌కి ఆ మాత్రం కూడా రాదు. చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్‌ శెట్టికి ఇప్పుడు విన్నర్‌కి మించిన పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. అయితే ఇందులోనూ కొంత టాక్స్ కట్ అవుతుందని చెప్పొచ్చు.

55
టాప్‌ 5లో నిలిచేది ఎవరు?

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 9 చివరి వారానికి చేరుకుంది. ఈ రోజు(ఆదివారం) మరో ఎలిమినేషన్‌ ఉంటుంది. దీంతో టాప్‌ 5 ఎవరనేది తెలిసిపోతుంది. వాళ్లు గ్రాండ్‌ ఫినాలేకి చేరుకుంటారు. వారిలో ఒకరు విన్నర్‌ అవుతారు. వచ్చే ఆదివారం గ్రాండ్‌ ఫినాలే ఉండబోతుంది. ఎవరు విన్‌ అవుతారో చూడాలి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌, తనూజ, సంజనా, డీమాన్‌ పవన్‌, భరణి ఉన్నారు. మరి ఈ రోజు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories