వేణు స్వామి చేసిన పూజ వృధాగా పోయింది అని నెటిజన్లు అంటున్నారు. అఖండ 2 వాయిదా పడడంతో మరోసారి వేణు స్వామిపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా జ్యోతిష్యుడు వేణు స్వామి సోషల్ మీడియాలో క్రేజీ సెలెబ్రెటీగా మారిపోయారు. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సమంత, నాగ చైతన్య పెళ్లి, ప్రభాస్ సినిమాలు, అల్లు అర్జున్, రాంచరణ్, రాజమౌళి, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఇలా ప్రతి సెలెబ్రిటీని టచ్ చేస్తూ వేణు స్వామి జాతకాలు చెప్పారు. కొన్ని సందర్భాల్లో వేణు స్వామి చెప్పిన జాతకం మిస్ ఫైర్ అయింది.
25
వేణు స్వామిపై ట్రోలింగ్
ప్రభాస్ కి బాహుబలి తర్వాత హిట్ ఉండదు అని అన్నారు. సలార్, కల్కి లాంటి హిట్స్ పడ్డాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో వేణు స్వామి ట్రోలింగ్ కి గురయ్యారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొంత కాలం వేణు స్వామి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు.
35
అఖండ 2 కోసం హోమం
వేణు స్వామి వద్ద టాలీవుడ్ హీరోయిన్లు, ఇతర సెలెబ్రిటీలు కూడా పూజలు, హోమాలు చేయించుకుంటూ ఉంటారు. ఇటీవల వేణు స్వామి తన సొంతంగా అఖండ 2 చిత్రం కోసం బగళాముఖి హోమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను వేణు స్వామి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎక్కడా అఖండ 2 అనే పేరు చెప్పలేదు కానీ.. త్వరలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమా సూపర్ హిట్ కావాలని ఈ హోమం చేస్తున్నట్లు వేణు స్వామి తెలిపారు. దీనితో వేణు స్వామి చేసిన హోమం అఖండ 2 గురించే అని అంతా క్లారిటీకి వచ్చారు. 2 రోజుల క్రితమే ఈ హోమం జరిగింది. కట్ చేస్తే .. శుక్రవారం రిలీజ్ కావలసిన అఖండ 2 చిత్రం ప్రీమియర్స్ కి కొన్ని గంటల ముందు వాయిదా పడింది.
55
వేణు స్వామిపై సెటైర్లు
నిర్మాతలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వివాదాల కారణంగా ఈ చిత్రం పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు అఖండ 2 గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సరిగ్గా రిలీజ్ కి కొన్ని గంటల ముందు వాయిదా అని నిర్మాతలు ప్రకటించడంతో అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వేణు స్వామి హోమం చేశారు.. అఖండ 2 వాయిదా పడింది అంటూ సెటైర్లతో ట్రోల్ చేస్తున్నారు.