Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?

Published : Dec 05, 2025, 01:40 PM IST

Mahesh Babu కెరీర్ లో కృష్ణ వినకుండా కథను సెలక్ట్ చేసుకుని తీసిన సినిమా ఒకటి డిజాస్టర్ అయ్యిందని మీకు తెలుసా? ఇంతకీ ఆ సినిమా ఏది? ఆమూవీపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన కామెంట్స్ ఏంటి?

PREV
15
కృష్ణ వారసుడిగా మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. బాలనటుడిగా తన ప్రతిభను చూపించిన ప్రిన్స్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఎదిగాడు. వారసత్వంతో వచ్చినంత మాత్రాన స్టార్ అవ్వాలని లేదు. ఇండస్ట్రీలో నిలబడాలంటే తమ సత్తా ఏంటో చూపించాల్సిందే. అలా వచ్చి నిలబలేకపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఎప్పటికప్పుడు మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. ట్రెండ్ కు తగ్గట్టు స్టైల్ మార్చుకుంటూ.. సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే కెరీర్ బిగినింగ్ లో మాత్రం కృష్ణ విన్న తరువాతే మహేష్ తన సినిమా కథకు ఒకే చెప్పేవారట.

25
కృష్ణ కథ వినకుండా మహేష్ నష్టపోయిన సినిమా?

మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఎదుగుతున్న టైమ్ లో ప్రతీ సినిమా కథను కృష్ణ వినేవారు. ఆయన విన్న తరువాతే ఆ కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఏదైనా కథ వింటే అంది కమర్షియల్ గా ఆడుతుందా లేదా, నిర్మాతకు డబ్బులు వస్తాయా, హీరో ఇమేజ్ కు అది సరిపోతుందా లేదా అనేది కరెక్ట్ గా జడ్జ్ చేసేవారు కృష్ణ. అయితే కృష్ణ కథ వినకుండా మహేష్ బాబు ఇష్టపడి చేసిన ఓ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. మహేష్ ఏంటి ఈ సినిమా చేశాడు అని అందరు ఆశ్చర్చపోయేలా చేసింది. ఆ సినిమా మరేదో కాదు నాని. మహేష్ బాబు కెరీర్ లో ప్లాప్ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ డిజాస్టర్స్ లిస్ట్ లో మాత్రం నాని ముందుంటంది.

35
నాని సినిమా గురించి కృష్ణ కామెంట్స్..

నాని సినిమా గురించి కృష్ణ మాట్లాడుతూ.. '' మహేష్ విషయంలో నేను విన్న సబ్జెక్ట్స్ అన్నీ హిట్ అయ్యాయి. కథ బాగోలేకపోతే చెయ్యోద్దు అని చెపుతాను. అలా నేను వినకుండా మహేష్ చేసిన నాని సినిమా ఒక్కటి డిజాస్టర్ అయ్యింది. అది నేను విని ఉంటే వద్దనేవాడ్ని. ఎందుకంటే అది మహేష్ ఇమేజ్ కు తగ్గ కథ కాదు. ఒక స్టార్ హీరో చేయాల్సి సినిమా కాదు. ఒక చిన్న కుర్రాడు పెద్దవాడు అవ్వడం.. అసలు ఆ కథ స్టార్ హీరోతో నడవదు. తమిళంలో కొత్త ఫేస్ తో చేశారు. ఆ డైరెక్టరే యాక్ట్ చేశాడు. అక్కడ బాగా ఆడింది. కానీ మహేష్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకు ఆ సినిమా కరెక్ట్ కాదు. '' అని కృష్ణ అన్నారు.

45
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..

సూపర్ స్టార్ కృష్ణకు టాలీవుడ్ లో చాలా రికార్డు లు ఉన్నాయి. ఏడాదిలో 22 సినిమాలు రిలీజ్ చేసి, 10 హిట్లు ఇచ్చిన ఘనత కృష్ణ సొంత. టాలీవుడ్ కు టెక్నాలజీ నేర్పిన హీరో క‌ృష్ణ. కానీ ఆయన సినిమాల విషయంలో అన్ని రికార్డులు క్రియేట్ చేస్తే.. మహేష్ రూట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తారు. కాస్త అటు ఇటు అయితే ఆ సినిమా కూడా రాదు. భారీ బడ్జెట్, భారీ కలెక్షన్స్, పాన్ ఇండియాను బేస్ చేసుకుని ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.అప్పటికంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయినా సరే.. సినిమాల సంఖ్యమాత్రం తగ్గుతూ వస్తోంది.

55
వారణాసి బిజీలో మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాకు దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఈసినిమాలో మహేష్ రుద్రగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన వారణాసి టైటిల్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసుకున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్కమైన పాత్రలో నటింస్తోన్న ఈసినిమా గురించి ఇతర వివరాల విషయంలో గోప్యత పాటిస్తున్నాడు జక్కన్న.

Read more Photos on
click me!

Recommended Stories