దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాటల ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే హీరో ఒక్కరే అని అన్నారు. ఆ హీరో ఎవరు ? తన కెరీర్ కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టిన సాంగ్ ఏది ? లాంటి వివరాలని దేవిశ్రీ రివీల్ చేశారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్కు గ్యారెంటీ. దేవిశ్రీ ప్రసాద్ అందించే పాటలు యువతని ఆకట్టుకునేలా, డ్యాన్స్ చేయాలనిపించేలా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్ర హీరోల చిత్రాలకు పనిచేశారు. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్.. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి అతిథిగా హాజరయ్యారు.
25
అది మెగాస్టార్ ఒక్కరే
ఈ షోలో జగపతి బాబు దేవిశ్రీని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు దేవిశ్రీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీ మ్యూజిక్ అంటేనే ఎనర్జీ.. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే హీరో ఎవరు అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని తెలిపారు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవల్. దేవిశ్రీ చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో కూడా దేవిశ్రీ ఎక్కువ సినిమాలు చేశారు.
35
సుకుమార్ నా బ్రదర్ తో సమానం
తాను ఇండస్ట్రీలో అన్ని విషయాలు షేర్ చేసుకునే ఒకే ఒక్క పర్సన్ సుకుమార్ అని దేవిశ్రీ అన్నారు. ఆయన నాకు సోదరుడితో సమానం అని దేవిశ్రీ అన్నారు. ఏ సాంగ్ కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ.. ఆర్య మూవీలో అ అంటే అమలాపురం పాట అని తెలిపారు. ఆ సాంగ్ కంపోజ్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది.
ఆర్య కంటే ముందు నేను నేను అభి అనే ఒక చిన్న సినిమా చేశాను. ఆబ్లిగేషన్ కొద్దీ ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ మూవీలో వంగతోట మలుపు కాడా అనే సాంగ్ ఉంటుంది. దిల్ రాజు ఆ సాంగ్ విని అదిరిపోయింది. ఇలాంటి పాటే, అదే వాయిస్ తో ఆర్యలో కూడా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా చటుక్కున అ అంటే అమలాపురం ఐడియా వచ్చింది.
55
పెళ్ళెప్పుడు ?
విశేషం ఏంటంటే ఆ రెండు పాటలని రాసింది వేటూరి గారే అని దేవిశ్రీ తెలిపారు. జగపతి బాబు దేవిశ్రీని మరో ప్రశ్న అడిగారు..ఫస్ట్ హీరో అవుతావా ? పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ పెళ్లి తో పాటు ఇంకే ఆప్షన్ ఇచ్చినా ఆ రెండో ఆప్షన్ నే ఎంచుకుంటాను అని అన్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, బలగం వేణు దర్శకత్వంలో ఒక చిత్రానికి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.