Roja selvamani daughter: హాలీవుడ్ లో అన్షు మాలిక. రోజా కూతురు ఎంట్రీ హాలీవుడ్ లో జరగబోతోందా? ఫారెన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతోందా. చదవుల్లో టాపర్ గా ఉన్న అన్షు ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు? ఆమె హాలీవుడ్ స్టూడియోకి వెళ్లడానికి కారణం ఏంటి?
హీరోయిన్ రోజా కూతురు అన్షు మాలిక బ్యూటీతో అభిమానులను కట్టిపడేస్తోంది. హీరోయిన్లను మించిన గ్లామర్ తో వెలిగిపోతున్న ఆమెను హీరోయిన్ గా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోజాను మించిన టాలెంట్ ఉన్న ఆమె ఇండస్ట్రీ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వారసుడి ఎంట్రీతో రోజా కూతురు ఎంట్రీ కూడా ఉంటుందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అన్షు మాత్రం అమెరికాలో తన చదవు కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లకు, ఫోటోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈక్రమంలో అన్షు హాలీవుడ్ స్టూడియోకు వెళ్లడం.. అందరి దృష్టిని ఆకర్శించింది. ఆమె సినీ ప్రవేశంపై వార్తలు మళ్లీ మొదలయ్యాయి.
25
హాలీవుడ్ స్టూడియోస్‌లో సందడి
ఇటీవల అన్షు మాలిక్ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'యూనివర్సల్ స్టూడియోస్' (Universal Studios) ముందు దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. వెనుక హాలీవుడ్ గ్లోబ్ మెరుస్తుండగా, ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ అన్షు సొంతం" అని కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ ఫోటోలు ఉండటంతో.. అన్షు త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతుందా? అనే ప్రచారం మళ్లీ మొదలైంది. హన్షు.. హాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతుందని అంతా అనుకుంటున్నారు. అక్కడే స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె కేవలం విజిట్ కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అమెరికాలో రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అన్షు... తాజాగా హాలీవుడ్ స్టూడియోస్ కి వెకేషన్ కి వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసి.. ఆఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
35
చదువులో రికార్డులు.. గ్లోబల్ అవార్డులు
అన్షు కేవలం స్టార్ కిడ్ అనిపించుకోవడమే కాదు, చదువులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్నతనంలోనే అన్షు "ది లైట్ ఇన్ ది డార్క్ నెస్" అనే పుస్తకాన్ని రచించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చదువులో ఆమె చూపిన ప్రతిభకు గానూ ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది 'గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు'ను కైవసం చేసుకున్నారు. అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించింది. తను చదువకుంటున్న రోజుల్లో పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకుంది. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అదనంగా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించింది.ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, సాంకేతిక రంగంలో ఎన్నో పతకాలు, సర్టిఫికేట్లు సాధించారు.
అన్షు అందం, అభినయం చూసిన అభిమానులు ఆమె టాలీవుడ్ లేదా కోలీవుడ్‌లో ఎప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా తండ్రి సెల్వమణి ప్రముఖ దర్శకుడు, తల్లి రోజా నటి కావడంతో సినీ రంగానికి ఆమె రాక సులభమే అని భావిస్తున్నారు.అయితే, ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అన్షు మాలిక్ సినీ ఎంట్రీపై ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.
55
అభిమానుల కోరిక.. రోజా కామెంట్స్...
అన్షు రోజాను మించిన అంతంతో హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు కలిగి ఉంది. కానీ ఆమె మాత్రం సినీరంగం వైపు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని తెలుస్తోంది. పిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించి, రాజకీయంలో మంత్రిగా కొనసాగిన రోజా కూతురు, ఈ రెండింటిలో ఏది ఎంచుకోకుండా చదువులో రాణిస్తూ.. అంతర్జాతీయ గుర్తింపుని సాధించింది. రోజా అభిమానులు మాత్రం అన్షును హీరోయిన్ గా చూడాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో రోజా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. "అన్షుకు ప్రస్తుతం చదువుపైనే పూర్తి దృష్టి ఉంది. తనకి సాంకేతిక రంగం, పరిశోధనలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలా వద్దా అనేది ఆమె సొంత నిర్ణయం" అని స్పష్టం చేశారు.