`లెనిన్` మూవీ జులై 10న విడుదలైంది. ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. మూడో వారంలోనూ డీసెంట్ నెంబర్స్ ని సొంతం చేసుకుంది. ఇది వంద కోట్ల దిశగా వెళ్తుందని టీమ్ ప్రకటించింది. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటించగా, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. శివాజీ, సునీల్, ఈశ్వరీ రావు, ప్రమోద్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు.