Aishwarya Rajesh: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

Published : Feb 08, 2025, 06:56 PM IST

Aishwarya Rajesh  Remuneration:  సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.  టాలీవుడ్ నిర్మాతలను తన డిమాండ్స్ తో భయపెడుతోందట బ్యూటీ ఇంతకీ ఆమె  సినిమాకు ఎంత తీసుకుంటుంది అంటే..? 

PREV
15
Aishwarya Rajesh: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

Aishwarya Rajesh Remuneration: ఐశ్వర్య రాజేష్.. తమిళంలో సెటిల్ అయిన అచ్చతెలుగు ఆడపిల్ల. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న  ఈ హీరోయిన్ .. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. తెలుగులో అవకాశాలు సాధించలేకపోయినా.. తమిళంలో మాత్రం మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఆతరువాత టాలీవుడ్ మేకర్స్ కూడా ఐశ్వర్యను బాగా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తమిళం కంటే కూడా తెలుగులోనే ఐశ్వర్య రాజేష్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.  

Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

25

తమిళంలో చాలా సినిమాల్లో నటించిన ఐశ్వర్య కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈసినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది ఐశ్వర్య. ఆతరువాత వరుసగా వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ ఎక్కువగా కాన్సప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ పైనే దృష్టి పెట్టింది. కమర్షియల్ సినిమాలకంటే కథ బాగుండే సినిమాలనే ఆమె ఒప్పుకుంటుంది. తాజాగా ఆమె సంక్రాంతికి వస్తున్నం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?

35

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో వెంకటేష్ భార్య భాగ్యం పాత్రంలో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మూవీ. ఇక ఈమూవీ తరువాత మరిన్ని ఆఫర్లు ఐశ్వర్య రాజేష్ ఇంటికి క్యూ కడుతున్నాయట.

Also Read: అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?

45

సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట ఐశ్వర్య. మొన్నటి వరకూ సినిమాకు కోటి రూపాయల వరకూతీసుకుందట ఐశ్వర్య రాజేష్. ఇక ఇప్పుడు సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని సమాచారం. 

Also Read:బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

55
aishwarya rajesh

దాంతో తెలుగులో ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవాలంటే కాస్త భయపడుతున్నారట నిర్మాతలు. కథ డిమాండ్ చేస్తే.. ఆమెను తీసుకోవడం తప్పదు కాబట్టి అడిగినంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నరట. నటిగా ఐశ్వర్య రాజేస్ చాలామంది స్టార్ హీరోయిన్లకంటే బెటర్ పెర్ఫామెన్స్ చూపిస్తుంది. హోమ్లీ హీరోయిన్ గా ఆమెకు స్పెషల్ ఇమేజ్ కూడా వచ్చింది. సో టాలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. 

Read more Photos on
click me!

Recommended Stories