దర్శకుడు సుజీత్ కూడా అదే ప్లాన్‌లో ఉన్నాడు, అదే చేస్తున్నాడు. పైగా సేమ్ ఏజ్, సేమ్ వేవ్‌లెన్త్ లో ఉన్నాడు. పైగా డిప్యూటీ సీఎం మూవీ కావడంతో చాలా కేర్ తీసుకుంటున్నాడు. `ఓజీ` ఒక మాసీవ్‌గా ఉండబోతుంది. అదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్‌ని అలానే చూడాలనుకుంటున్నారు. మన తెలుగు నుంచి కూడా అలాంటి ప్రాపర్ గ్యాంగ్ స్టర్ మూవీ రాలేదు.
ఇతర భాషల్లో `లియో`, `జైలర్`, `బీస్ట్` వంటి సినిమాలు చూశాం. అలాంటి మూవీస్ టాలీవుడ్ నుంచి చూడాలనుకుంటున్నారు. అది పవన్ నుంచి అంటే వేరే లెవల్ అని చెప్పొచ్చు అంటూ ఒక రేంజ్‌లో హైప్ ఇచ్చాడు థమన్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ నిఖిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.