ఐశ్వర్యా రాజేష్‌ బాల నటిగా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఏకంగా స్టార్‌ హీరోతో!

First Published | Jan 16, 2025, 10:34 PM IST

`సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది ఐశ్వర్యా రాజేష్‌. మరి ఆమె బాలనటిగా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? 
 

ఐశ్వర్యా రాజేష్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌ మోగిపోతుంది. అంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఆమె తెలుగులో బిజీ హీరోయిన్‌ అయిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో ఆమె నటించడం. వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంగళవారం విడుదలై బ్లాక్‌ బస్టర్ టాక్‌ తో రన్‌ అవుతుంది. 
 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇందులో కామెడీ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్‌తో ఐశ్వర్యా రాజేష్‌ చేసే కామెడీ హైలైట్‌గా చెప్పొచ్చు. అంతేకాదు చాలా సన్నివేశాల్లో వెంకీని డామినేట్‌ చేసింది. అనుమానం, జెలసీ ఫీలయ్యే పాత్రలో అదరగొట్టింది ఐశ్వర్యా రాజేష్‌.  ప్రియురాలు మీనాక్షి రావడంతో ఐష్‌ అనుమానాలు ఈ క్రమంలో ఆమె మాటలు, ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. 
 


దీంతో ఐష్‌ నటన గురించే అంతా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వారిది తెలుగు ఫ్యామిలీ అనే విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేష్‌ అప్పట్లో మంచి నటుడు. హీరోగానూ సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు వంటి వారి సినిమాల్లోనూ నటించారు. హీరోగా, విలన్‌గా మెప్పించారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. 
 

Aishwarya Rajesh

ఇదిలా ఉటే ఐశ్వర్యా బాలనటిగానూ నటించారు. ఆమె నటిగా తెరంగేట్రం చేసింది తెలుగు సినిమాతోనే. అది రాజేంద్రప్రసాద్‌ నటించిన `రాంబంటు` సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ బాల నటిగా నటించింది. ఇందులో ఓ చిన్న రోల్‌లో ఆమె మెరిసింది. `ఏమో గుర్రం ఎగరా వచ్చు` అనే పాటలో బేబీ ఐశ్వర్యా కాసేపు కనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ కూతురిగా కనిపిస్తుంది. 
 

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించగా, ఆయనకు జోడీగా ఈశ్వరీ రావు హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆమె ఇప్పుడు మదర్‌ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. 1995లో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇందులో కామెడీతోనే కాదు, యాక్షన్‌తోనూ అదరగొట్టారు రాజేంద్రప్రసాద్‌. 

read more: ఆడవాళ్లు శోభన్‌ బాబు అంటే పడిచచ్చేది అందుకే, సీనియర్‌ హీరోలకు సాధ్యం కాలేదు, కానీ వెంకీ ఆ నాడి పట్టుకున్నాడు!
 

బాలనటిగా `రాంబట్టు` ఒక్క చిత్రానికే పరిమితమైన ఐశ్వర్యా రాజేష్‌.. తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. `కౌసల్య కృష్ణమూర్తి` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `మిస్‌ బ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాలు చేసింది.

కానీ అన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు చేసిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఆమెకి తెలుగులో బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇకపై టాలీవుడ్‌లో ఐశ్వర్యా రాజేష్‌ బిజీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

read  more: సంక్రాంతి సూపర్ హిట్స్.. పదేళ్ల లిస్ట్ (2016- 2025), పొంగల్‌ విన్నర్స్ వీరే!

also read: చిరంజీవితో సినిమా అంటే ఇప్పటికీ టెన్షనే.. సినిమాలు చేయకపోవడంపై నిజాలు బయటపెట్టిన బ్రహ్మానందం

Latest Videos

click me!