ఒకసారి తన స్నేహితులతో కలసి కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఒక జ్యోతిష్యుడు ఆమె చేయి చూసి నువ్వు హీరోయిన్ అవుతావు అని చెప్పాడట. ఆ టైంకి కంగనా కి సినిమాల గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. సినిమాలతో సంబంధం లేని జీవితం ఆమెది. ఈయనేంటి ఇలా చెబుతున్నాడు అని అనుకుందట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంగనా హీరోయిన్ అయింది. అంతే కాదు బాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా వివాదాలు, సంచలనాలు సృష్టించింది.