హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల సినిమాలు కూడా చేయడం లేదు. అడపాదడపా కనిపిస్తున్నారు తప్పితే తన మార్క్ కామెడీ లేదు. అలాంటి పాత్రలు చేయడం లేదు. `రంగమార్తాండ`లో సీరియస్ రోల్‌లో నటించి కన్నీళ్లు పెట్టించారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు, కానీ ఆయన పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా స్పందించారు బ్రహ్మానందం. ఎక్కువగా సినిమాలు చేయకోపోవడానికి కారణం? ఆఫర్లు రావడం లేదా? మీరు చేయడం లేదా? అనే ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. తాను నాలభై ఏళ్లల్లో ఎన్నో రకాల పాత్రలు చేశానని, అదే చేస్తే బోర్ కొడుతుంది.
ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే, అదే కామెడీ చేస్తే, బ్రహ్మానందం బాగానే చేస్తున్నాడు కానీ, నవ్వు రావడం లేదురా అని అనుకుంటారు. గతంలో కమెడియన్ల విషయంలో ఇలాంటి మాటలు విన్నాం. ఇప్పుడు తన విషయంలో కూడా నిరూపితమైందన్నారు.
`మన గురించి మనం తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్లిపోకూడదని, అదే సమయంలో ఏజ్ ఫ్యాక్టర్‌ని కూడా చూసుకోవాలన్నారు. ఏజ్‌ని కూడా అంగీకరించాలి, అది గమనించకుండా నేను యంగ్ అని పోతే వర్కౌట్ కాదు, ఇంతకు ముంద చేసినంత యాక్టీవ్‌గా కూడా నేను చేయలేకపోతున్నాననే విషయం నాకు తెలుసు.
నన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలని సెల్ఫ్ క్రిటిసిజమ్‌తో తీసుకున్న నిర్ణయం ఇది. అంతేకానీ సినిమాల్లో నేను చేస్తానంటే వేషాలు లేక కాదు, ఇవ్వక కాదు, చేయలేక కాదు, ఇలాంటి టైమ్‌లో ఎంత జాగ్రత్త చేసినా కూడా దొరికిపోతాం. అందుకే సెల్ఫ్ క్రిటిసిజమ్ చాలా ముఖ్యం` అని తెలిపారు బ్రహ్మానందం.
అదే సమయంలో మరో ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని ఏళ్లు ఉన్నా, ప్రతి సినిమా కొత్తగానే ఫీలవ్వాలని, అంతే జాగ్రత్తగా చేయాలని తెలిపారు బ్రహ్మీ. ఈ క్రమంలో చిరంజీవి ప్రస్తావన తెస్తూ. చిరంజీవితో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను,
కానీ రేపు కొత్త సినిమాలో ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే తెలియకుండానే బెరుకు స్టార్ట్ అవుతుంది. షాట్ అయిపోయిన తర్వాత అందరు బాగుందంటే ఓకే, అప్పటి వరకు ఓ టెన్షన్ ఉంటూనే ఉంటుందన్నారు బ్రహ్మానందం.
read more: ఊరమాస్ కాంబోని సెట్ చేసిన బాలకృష్ణ.. ఈసారి బోయపాటి సినిమాని మించి !
తన కొడుకుతో కలిసి `బ్రహ్మానందం` అనే సినిమాలో నటించారు. ఇందులో గౌతమ్‌కి తాత పాత్రలో బ్రహ్మీ కనిపిస్తుండటం విశేషం. ఈ మూవీ టీజర్ కార్యక్రమంలో బ్రహ్మానందం అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో గౌతమ్ కెరీర్‌కి గురించి చెబుతూ, తన పలుకుబడి ఉపయోగించి పెద్ద సినిమాలు చేయోచ్చు కదా అనే ప్రశ్నకి స్పందిస్తూ,
తనకు తానే ఆ పలుకుబడి ఉపయోగించుకోలేదని తెలిపారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ అవకాశాలు ఇవ్వాలని అడగలేదని, అయితే తాను తోపు అని అంటే అది అహంకారం అవుతుందని, కానీ అడిగే అవకాశం దేవుడు తనకు కల్పించలేదన్నారు బ్రహ్మా.
ఇక్కడ ఎవరి పలుకుబడి వాడితే ఆఫర్లు వస్తాయి, పెద్ద హీరో అయిపోతారనేది బ్రమ అని చెప్పారు. మన వైపు లైట్ ఉన్నప్పుడు మనం వెలుగుతాం. దీంతో మనమే హీరో, మనకే తిరుగులేదు అని భావిస్తే వాడి పని అయిపోయినట్టే, ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ వస్తుంది. ఎవరి టైమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏదైనా రాసి పెట్టి ఉండాలి, మనం ఏదో చేస్తే ఏదో అయిపోరు అంటూ వాస్తవాలు చెప్పారు బ్రహ్మానందం.
అన్నింటికి డెస్టినే సమాధానం చెబుతుందన్నారు. మనం అనుకుంటే ఏది అయిపోదని, జరగొద్దు అనుకుంటే ఏది ఆగదు అని, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నారు. ఇక ఇందులోనే వెన్నెల కిశోర్‌పై ప్రశంసలు కురిపించారు. తన లెగసీని వెన్నెల కిశోర్ కంటిన్యూ చేస్తున్నాడని, అతని విషయంలో గర్వంగా ఉందన్నారు బ్రహ్మీ.
read more: పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ టైమ్ చిరంజీవి వార్నింగ్, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు ఆ పనిచేయలేదు
also read: ఆడవాళ్లు శోభన్ బాబు అంటే పడిచచ్చేది అందుకే, సీనియర్ హీరోలకు సాధ్యం కాలేదు, కానీ వెంకీ ఆ నాడి పట్టుకున్నాడు!