200 కిలోల బంగారం వేసుకున్న ఐశ్వర్యరాయ్.. . ఎన్ని కోట్లు విలువచేస్తాయో తెలుసా..?

First Published | Aug 1, 2024, 2:53 PM IST

స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 200 కేజీల నగలు వేసుకోవడం ఏంటి..? వాటి విలువెంత..? అసలెందుకు ఇలా ఇంత బరువైన నగలు ఆమె ధరించిందో తెలుసా.? 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. వదల కోట్ల ఆస్తి.. హీరోయిన్ గా స్టార్ డమ్.. ఏజ్ పెరిగిన తరగని గ్లామర్, ఇమేజ్. ఇలా ఐశ్వర్య రాయ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి రకరకాల కారణాలే ఉన్నాయి. అయితే ఐశ్వర్య రాయ్ ఓ సందర్భంలో వేసుకున్న నగలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..? ఇంతకీ విషయం ఏంటంటే..? 

బాహుబలి3 అంటేనే భయపడుతున్న ప్రభాస్, రాజమౌళి అడిగితే అలా అన్నాడేంటి..?

అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన 'జోధా అక్బర్' మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు అతని యువరాణి జోధా భాయ్‌ల ప్రేమకథను చెబుతుంది. ఇందులో హృతిక్ రోషన్ సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య నటన కంటే ఆమె పాత్రే ఎక్కువగా చర్చనీయాంశమైంది.ఐశ్వర్యరాయ్ లుక్‌కు పెళ్లికూతుళ్ల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది.

ఆర్య, ఎన్టీఆర్ నుంచి రజినీకాంత్ - చిరంజీవి వరకు... భారీ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు 

Latest Videos


ఈ సినిమాలో బట్టల నుంచి నగల వరకు అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేశాయి. జోధా అక్బర్' కోసం ఐశ్వర్యరాయ్ దాదాపు 200 కిలోల బంగారాన్ని ధరించింది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ మరియు హృతిక్ రోషన్ ఆభరణాలు మొఘల్ మరియు రాజస్థానీ డిజైన్‌లను తలపించేవిగా ఉన్నాయి.  400 కిలోల బంగారం మరియు ఇతర విలువైన రాళ్లతో వారి అద్భుతమైన ఆభరణాలను రూపొందించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందట.

ఒక్క ‘జోధా అక్బర్‌’లోనే ఐశ్వర్య నగలను తయారు చేసేందుకు 70 మంది కళాకారులు నిరంతరంపనిచేశారట. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ధరించిన వెడ్డింగ్ నెక్లెస్ బరువు మూడున్నర కిలోలకు పైగా ఉంటుంది. ఆ సన్నివేశాల కోసం ఐశ్వర్య ఆభరణాలు మొఘల్ కాలం లాగే తయారు చేయబడ్డాయి. ఆ కాలం నాటి అనేక పాత పెయింటింగ్స్ ఆభరణాల తయారీకి ఉపయోగించబడ్డాయి.

ఈ సినిమా షూటింగ్ సమయంలో నగలు ధరించడం చాలా కష్టమని ఐశ్వర్యరాయ్ ఒకసారి చెప్పింది. 2008లో విడుదలైన 'జోధా అక్బర్' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్నితెలుగు,తమిళ భాషలతో పాటు.. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. 

సినిమా మొత్తంలో ఐశ్వర్యరాయ్ దాదాపు 200 కిలోల ఒరిజినల్ బంగారు ఆభరణాలను ధరించినట్లు సమాచారం. బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లతో చేసిన ఆభరణాల భద్రత కోసం 50 మంది భద్రతా బలగాలను నియమించారు.

click me!