మలయాళ తెర సూపర్ స్టార్ మమ్ముట్టి 1951లో జన్మించారు. 1979లో, అతను తన కంటే 10 సంవత్సరాలు చిన్నవారైన సల్ఫత్ కుట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కాగా వారిలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒకరుకావడం విశేషం. ఇక తమిళ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ లతా రంగాచారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981లో జరగగా, రజనీకాంత్ తన భార్య కంటే 8 ఏళ్లు పెద్దవాడు కావడం గమనార్హం.