యోగి బాబు 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ రివ్యూ!

First Published | Aug 1, 2024, 2:13 PM IST

 ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్న సీరిస్ కావటంతో ఫ్యామిలీతో కూర్చుని ఓ సాయింత్రం కాలక్షేపం చేయినిస్తుంది. అయితే కొన్ని లోపాలు లేకపోలేదు.

Chutney Sambar

టైటిల్ చూడగానే ఇదేదో వంటకు సంభందించిన పోటీలా ఉందే అనిపిస్తుంది. అయితే అదే సమయంలో యోగిబాబు ఉండటం తో కాసేపు నవ్వుకోవచ్చు కదా అనిపిస్తుంది.  దానికి తోడు వరస పెట్టి క్రైమ్ వెబ్ సీరిస్ లు వదులుతూ ఓటిటిలు ఓ చిత్రమైన మూడ్ ని  క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో వాటికి భిన్నంగా వచ్చిన ఈ చట్నీ సాంబార్ (Chutney Sambar)  సీరిస్ ఎలా ఉంది.. యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాధామోహన్ డైరక్ట్ చేసిన ఈ సీరిస్ చూడచ్చా

Chutney Sambar


కథేంటి

ఇది మణిరత్నం ఘర్షణ లాంటి సెటప్. ఒకే తండ్రికు పుట్టిన ఇద్దరు కొడుకులు. వాళ్లు ఏకం అవటం.  ఊటీలో హోటల్ వ్యాపారం చేస్తున్న రత్నస్వామి (నిళల్ గల్ రవి) మంచి పేరు ఉంది. ఆయన   'అముద'  హోటల్ 'సాంబార్' చాలా ఫేమస్. ఆ టేస్ట్ కోసం  ఎక్కడెక్కడ జనం వచ్చి తినేసి పోతూంటారు. అయితే ఆ సాంబార్ ఫార్ములా బయిట ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూంటాడు.  ఆయనకు  భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్) కొడుకు కార్తిక్ (చంద్రన్) కూతురు అముద (మైన నందిని) ఆమె భర్త .. అందరూ ఒకే ఇంట్లో ఉంటూంటారు.   ఆ ఇంట్లో వంట మనిషి  సోఫీ ( వాణి భోజన్). అంతా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో ఆయనకు ప్రాంకియాజ్ కాన్సర్ రావటంతో ఇంక ఎంతో కాలం బ్రతకరని తెలుస్తుంది. 
 


Chutney Sambar


దాంతో చివరి రోజులకు దగ్గర పడుతున్న రత్నస్వామి తన కొడుకు కార్తీక్ ని పిలిచి ఓ కోరిక కోరుతాడు. అది ఆయన పెళ్లికు ముందు ముడిపడ్డ ఓ లవ్ స్టోరీకి చెందింది. ఆయన అప్పట్లో   'అముద' ఆమెను ప్రేమించి  ఓ బిడ్డను కూడా కంటాడు. కానీ ఆ తర్వాత వాళ్లకు దూరం అవుతాడు. ఇప్పుడు అవన్నీ గుర్తు వచ్చి...అప్పుడు పుట్టిన కొడుకుని ఎలాగైనా చూడాలని ఉందని చెప్తాడు. ఆ కొడుకు ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాడని క్లూ ఇస్తాడు. దాంతో కార్తీక్ తన బావని,మరో స్నేహితుడుని తీసుకుని తన తండ్రి మొదటి భార్య కొడుకుని పట్టుకురావాలని బయిలు దేరతాడు.

Chutney Sambar


ఇక ఆ కొడుకు మరెవరో కాదు  సచిన్ (యోగిబాబు). మొత్తానికి కష్టపడి అతన్ని  కలుసుకుంటాడు. సచిన్ కి చెన్నై లో  ఇడ్లీ బండి .. అతను చేసే చట్నీపెద్ద ఫేమస్. కార్తీక్ వెళ్లి తన అన్న అయిన సచిన్ ని కలుస్తాడు. కానీ సచిన్ కు తన తల్లిని మోసం చేసిన తండ్రిని కలవటం ఇష్టం ఉండదు. చాలా కోపం ఉంటుంది. రకరకాల ప్రయత్నాలు చేసి ఒప్పించి సచిన్ ని  రత్నస్వామిని కలుస్తాడు. తన కొడుకుని  చూస్తూనే రత్నస్వామి ప్రాణాలు వదులుతాడు. కార్తీక్ అప్పుడు సచిన్ ని 12 రోజులు కార్యక్రమాలు అయ్యేదాకా ఉండి తండ్రి ఆత్మకు శాంతి కల్పించమంటాడు. అయిష్టంగా ఒప్పుకున్న సచిన్ కు ఆ 12 రోజులు అక్కడే ఉండగలిగాడా..అందుకోసం అతను పెట్టిన కండీషన్స్ ఏమిటి... ఆ ఇంట్లో వాళ్లకు సచిన్ గురించిన నిజం తెలిస్తే ఎలా స్పందించారు అనే విషయాలు తెలియాలంటే సీరిస్ మొత్తం చూడాల్సిందే. 
 

Chutney Sambar

ఎలా ఉంది

మన తెలుగు వారికి కూడా తమిళ డబ్బింగ్ సినిమాల వల్ల , ఓటిటి సినిమాల  వల్ల యోగిబాబు బాగా పరిచయం అయ్యాడు. ఆయన  ప్రధాన పాత్రలో వెబ్ సీరిస్ అనగానే ఖచ్చితంగా ఫన్ సీరిస్ అని , బాడీ షేమింగ్ ని బేస్ చేసుకునే నడిపే అవకాసం ఉందని భావిస్తాము. అయితే చట్నీ సాంబార్ డైరక్టర్ రాధామోహన్ రెగ్యులర్ కి భిన్నంగా వెళ్దామనుకున్నారు. పొటిన్షియల్ ఉన్న ప్రిమైజ్ తో, ఫ్యామిలీ డ్రామా గా దీన్ని తీర్చి దిద్దారు. రాధా మోహన్ అంటే ఎవరో కాదు గతంలో ప్రకాష్ రాజ్, త్రిష కాంబోలో ఆకాశమంత , ఆ తర్వాత అల్లు శిరీష్ తో గౌరవం, నాగ్ తో గగనం వంటి సినిమాలు తీసిన వాడే. సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీసే డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు తీసిన ఈ సీరిస్ కొంచెం కొత్తగానే ఉందని చెప్పాలి. ఆరు ఎపిసోడ్స్ సాగే ఈ సీరిస్ రెగ్యులర్ క్రైమ్ సీరిస్ ల నుంచి రిలీఫ్ ఇస్తుంది.  

Chutney Sambar

వాస్తవానికి ఇదేమి కొత్త కథా కాదు...గొప్ప కథ కాదు, అవుటాప్ ది భాక్స్ కాన్సెప్టు  అసలే కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్న సీరిస్ కావటంతో ఫ్యామిలీతో కూర్చుని ఓ సాయింత్రం కాలక్షేపం చేయినిస్తుంది. అయితే కొన్ని లోపాలు లేకపోలేదు. ఎడిటింగ్ హడావిడిగా చేసినట్లు అనిపిస్తుంది. ఆరు ఎపిసోడ్స్ లో ముగించాలని, చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి హడావిడి చేసారు. అలాగే క్యారక్టర్ ఛేంజ్ అందరూ ఊహించేదే. అదీ చివరి పది నిముషాల్లో అంటే బాగా సినిమాటెక్ గా అనిపించి అప్పటిదాకా ఉన్న రియలిస్టిక్ ఎప్రోచ్ మాయమవుతుంది. వన్ లైనర్స్ మాత్రం బాగా రాసారు. కొన్ని చోట్ల డైలాగులు వినపడనివ్వకుండా మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. 

Chutney Sambar


టెక్నికల్ గా ..

స్క్రిప్టు పరంగా, డైరక్షన్ పరంగా కూల్ గా సీరిస్ ని లాగారు. మనం కాస్తంత ఓల్డ్ స్కూల్ డ్రామా ఫిల్మ్ లకు అబిమాని అయితే ఈ సీరిస్ పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్  అన్ని బాగా ఎక్కేస్తాయి. అయితే ఇంకా ఈ రోజుల్లో ఈ మెలోడ్రామా సీన్స్ ఏమిటి అనుకుంటే కష్టమనిపిస్తుంది. 
 

Chutney Sambar


టెక్నికల్ గా కూడా ఈ సీరిస్ మంచి స్టాండర్డ్స్ లో ఉంది. రాధామోడన్ డైరక్షన్ నాచురాలిటికి దగ్గరిగా సాగింది. డైలాగులు బాగున్నాయి. యోగిబాబు చాలా బాగా చేసారు. ఊటీ లొకేషన్స్  చాలా బాగా ప్రెంజెంట్ చేసారు. ప్రసన్న కుమార్ కెమెరా వర్క్ కు మంచి మార్కులు పడతాయి. అలాగే  అజేశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీరిస్ కు ఊతం ఇచ్చింది. తం  జిజేన్ద్రన్ ఎడిటింగ్ కాస్త సాగతీసినట్లు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

Chutney Sambar

ఫైనల్ థాట్...

తెలిసిన విషయాన్ని అయినా ఎంత నీట్ గా చెప్పచ్చు..ఎంత చక్కటి డ్రామా,ఎమోషన్ పండించవచ్చు అనేది ఈ వెబ్ సీరిస్ చూస్తే అర్దమవుతుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని చూడదగ్గ సీరిస్. అలాగే  అసభ్యంత,హింస లేదు కాబట్టి పిల్లలతో కలిసి చూడవచ్చు. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎక్కడ చూడాలి

డిస్నీ  హాట్ స్టార్  లో తెలుగులో ఉంది

Latest Videos

click me!