రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమెకి లైఫ్ వచ్చింది స్టార్ హీరో కూతురు వల్ల. ఆమె నో చెప్పడంతో రష్మిక జీవితమే మారిపోయింది.
`గీత గోవింద` చిత్రంలో మొదటి సారి రష్మిక మందన్నా, విజయ్ కలిసి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత రష్మిక టాలీవుడ్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు, రష్మిక జీవితంలోకి విజయ్ వచ్చింది కూడా ఈ సినిమాతోనే. అయితే ఈ ఆఫర్ మొదట వేరే హీరోయిన్‌కు వెళ్లిందని మీకు తెలుసా?
26
గీత గోవిందం ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్య అర్జున్
అవును, 'గీత గోవిందం' సినిమా కథను మొదట సౌత్ ఇండియా స్టార్ హీరో అర్జున్ సర్జా కూతురు, నటి ఐశ్వర్య అర్జున్‌కు చెప్పారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేకపోయానని స్వయంగా ఐశ్వర్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కథను చాలా మంది హీరోయిన్లకు చెప్పారని, చివరికి అది రష్మిక చేతికి వెళ్లిందని ఆమె అన్నారు.
36
సినిమాలు మిస్ చేసుకున్న ఐశ్వర్య అర్జున్
'సీతా పయణం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య అర్జున్ మాట్లాడారు. తనకు మంచి స్క్రిప్ట్‌లు రావాలని, కొన్ని కథలు నచ్చినా అవి పట్టాలెక్కలేదని చెప్పారు. కన్నడలో 'ప్రేమబరహ' సినిమా బాగా ఆడినా, ఆ తర్వాత మంచి స్క్రిప్ట్‌లు రాకపోవడంతో చాలా సినిమాలు చేజారిపోయాయని ఆమె తెలిపారు.
తాను కథ విని, చేయకుండా వదిలేసిన సినిమాలు పెద్ద బ్లాక్‌బస్టర్లు అయ్యాయని ఐశ్వర్య అన్నారు. కన్నడ, తెలుగు రెండు భాషల్లోనూ ఇలా జరిగిందని చెప్పారు. తెలుగులో 'గీత గోవిందం' కథను చాలా మంది హీరోయిన్లు విన్నారని, తాను కూడా విన్నానని, కానీ నటించడం కుదరలేదని తెలిపారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.
56
వంద కోట్లు రాబట్టిన `గీతగోవిందం`
2018లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా 'గీత గోవిందం' భారీ విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. కేవలం 5 నుంచి 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఐశ్వర్య నో చెప్పడంతో ఈ ఆఫర్ రష్మికకి వెళ్లింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆమె జీవితానే మార్చేసింది.
66
రష్మిక మందన్నాకి లైఫ్ ఇచ్చిన హీరోయిన్
ఐశ్వర్య అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో రష్మిక అభిమానులు స్పందించారు. 'మీరు సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేశారు. ఈ సినిమా రష్మిక కోసమే పుట్టింది. ఈ సినిమా వల్లే రష్మిక, విజయ్ దేవరకొండ జంటయ్యారు. టాలీవుడ్‌కు రష్మిక దొరికింది' అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఐశ్వర్య ఈ మూవీకి నో చెప్పి, రష్మికాకి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు.