పెళ్లి తర్వాత ఎవరూ ఊహించని హీరోయిన్ తో నాగ చైతన్య రొమాన్స్, ట్రోలింగ్ తప్పదేమో..సెన్సేషనల్ కాంబో ?

First Published | Nov 1, 2024, 6:54 PM IST

పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించబోయే చిత్రం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఒక సెన్సేషనల్ కాంబినేషన్ లో నాగ చైతన్య నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాలతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న చైతు ఆగష్టులో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత చైతు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలిలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఇటీవలే పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. తండేల్ మూవీ చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది. ఇక కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే ఉందని డైరెక్టర్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 4న చైతు, శోభిత వివాహం జరగనుంది. అంటే పెళ్లి టైంకి తండేల్ చిత్రం పూర్తయిపోతుంది. 

Also Read : దీపావళి సెలెబ్రేషన్స్ లో మెగా హీరోలంతా ఒక్క చోట.. అల్లు అర్జున్ తప్ప, వైరల్ ఫొటోస్


ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించబోయే చిత్రం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఒక సెన్సేషనల్ కాంబినేషన్ లో నాగ చైతన్య నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యకి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. మజిలీ మూవీ అనగానే నాగ చైతన్య యాక్టింగ్ తో పాటు సమంత ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో సమంత చాలా సన్నివేశాల్లో తన నటనతో అదరగొట్టేసింది. చైతు, సమంత భార్యాభర్తలుగా ఉన్నప్పుడు తెరకెక్కిన చిత్రం ఇది.

Also Read : హరికృష్ణ, బాలయ్య నుంచి చైతు, అఖిల్ వరకు.. వరుసలు పక్కన పెట్టి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేసిన రియల్ బ్రదర్స్ 

ఇప్పుడు శివ నిర్వాణ నాగ చైతన్యతో సినిమా చేస్తున్నాడు అంటే తప్పకుండా సమంతతో పోలికని నెటిజన్లు తీసుకువస్తారు. అందుతున్న సమాచారం మేరకు చైతూకి జోడిగా ఈ మూవీలో జాన్వీ కపూర్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించడం దాదాపు ఖాయం అని అంటున్నారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రాంచరణ్ తో కూడా కలసి నటిస్తోంది. నాగ చైతన్య సినిమాలో ఆమె నటిస్తే తప్పకుండా సమంతతో పోలిక పెడతారు. 

Janhvi Kapoor

సినిమా కొంచెం అటుఇటు అయినా సమంతలాగా చేయలేదు అంటూ ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మజిలీ తర్వాత శివ నిర్వాణ, చైతు కాంబోలో వస్తున్న చిత్రం కాబట్టి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

Latest Videos

click me!