ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోల చేతుల్లో మోసపోయిన నగ్మా.. సంచలన నిర్ణయం వెనుక గుండె పగిలేనిజాలు

First Published | Nov 1, 2024, 6:52 PM IST

నగ్మా.. ప్రేమ విషయంలో మోసపోతూనే వచ్చింది. ఆమెని ఏకంగా నలుగురు స్టార్లు మోసం చేయడం బాధాకరం. దీంతో ఈ గ్లామర్‌ క్వీన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 

నగ్మా ఇండియన్‌ సినిమాని బాగా షేక్ చేసిన హీరోయిన్లలో ఒకరు. ఆమె అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బోజ్‌పూరీ, బెంగాలీ సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో టాప్‌ స్టార్స్ తో ఆడిపాడింది నగ్మా. చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలతో జోడీగా కట్టి ఆద్యంతం కనువిందు చేసింది. అప్పట్లో గ్లామర్‌ క్వీన్‌గా ఆకట్టుకుంది. మాస్‌ ఆడియెన్స్ కి బెస్ట్ ఛాయిస్‌గా ఉండేది. చాలా మంది హీరోలు నగ్మా కోసం వెయిట్‌ చేశారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పొగరున్న అమ్మాయి పాత్రలు, సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రల్లో నటించి ఆకట్టుకుంది నగ్మా. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఆమె చాలా పేదరికం నుంచి వచ్చింది. తండ్రి చేసిన మోసంతో రోడ్డున పడే పరిస్థితి నుంచి నెమ్మదిగా నటిగా మారి నిలదొక్కుకుంటూ వచ్చింది. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌ గా మారిపోయింది. కెరీర్‌ పీక్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా నిలిచింది. అయితే ఈ క్రమంలో ఆమె లవ్‌ ఎఫైర్స్ నగ్మా కెరీర్‌ని దెబ్బతీశాయని చెప్పొచ్చు. 


Nagma

ప్రారంభంలో ఆమె స్టార్‌ క్రికెటర్‌, అప్పట్లో టీమిండియా కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీతో ప్రేమాయణం సాగించింది నగ్మా. కొన్నాళ్లపాటు ఈ ఇద్దరు సహజీవనం చేశారట. అయితే పెళ్లి వరకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. తిరుపతిలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారని, కానీ ఈ విషయం గంగూలీ భార్యకి తెలియడంతో ఆమె పెద్ద గొడవ చేసిందని దీంతో పెళ్లి నిర్ణయం వెనక్కి తీసుకున్నారట. నగ్మా, ఫ్యామిలీనా ? అనే ప్రశ్న వచ్చిన నేపథ్యంలో నగ్మాకి హ్యాండిచ్చి ఫ్యామిలికే ప్రయారిటీ ఇచ్చాడు గంగూలీ. దీంతో నగ్మా హార్ట్ బ్రేక్‌ అయ్యిందట. 
 

Actress Nagma

ఆ తర్వాత నగ్మా కొన్నాళ్లు తన సినిమాలతోనే బిజీగా ఉంది. అయితే ఆ సమయంలోనే సౌత్‌పై ఫోకస్‌ పెట్టింది. తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. అందులో భాగంగా శరత్‌ కుమార్‌కి దగ్గరయ్యిందట. ఈ ఇద్దరు ప్రేమించుకున్నారట. అంతేకాదు నగ్మా కోసం ఏకంగా శరత్‌ కుమార్‌ సినిమాలు కూడా నిర్మించాడని, ఆమెతో తిరుగుతున్నాడని శరత్‌ కుమార్‌ మొదటి భార్యకి తెలిసింది. అది పెద్ద ఇష్యూ అయ్యింది. శరత్‌ కుమార్‌కి విడాకులు కూడా ఇచ్చింది. కానీ అప్పటికే శరత్‌ కుమార్‌, నగ్మాకి గ్యాప్ వచ్చింది. అయినా నగ్మా వెయిట్‌ చేసింద. కానీ శరత్‌ కుమార్‌ ఆమెని పెళ్లి చేసుకోలేదు. అనూహ్యంగా రాధికాని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
 

రెండుసార్లు ప్రేమ విషయంలో మోసపోయింది నగ్మా. దీంతో సౌత్‌ సినిమాలు తగ్గించింది. భోజ్‌పూరిలో సినిమాలు చేసింది. అక్కడ ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అనేసరికి భోజ్‌పూరీ మేకర్స్ నెత్తిన పెట్టుకుని ఆఫర్లు ఇచ్చారు. అక్కడ స్టార్‌గా రాణిస్తున్న రవికిషన్‌తో బాగానే సినిమాలు చేసింది నగ్మా. దీంతో ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ స్టార్ట్ అయ్యింది. ఇద్దరు లివింగ్‌ రిలేషన్స్ లో ఉన్నారు. మ్యారేజ్‌కి కూడా సిద్ధమయ్యారట. కానీ రవికిషన్‌ ఫ్యామిలీ, వైఫ్‌ నుంచి పెద్ద గొడవ చేయడంతో రవికిషన్‌ చేసేదేం లేక నగ్మాకి బ్రేకప్‌ చెప్పాడట. 
 

ఆ టైమ్‌లోనే మరో భోజ్‌పూరీ స్టార్‌ మనోజ్‌ తివారికి దగ్గరయ్యింది. అయితే సినిమాల్లో రవికిషన్‌, మనోజ్‌ తివారీ ల మధ్య గట్టి పోటీ ఉండేది. దీంతో నగ్మా.. రవికిషన్‌పై ఉన్న కోపంతో మనోజ్ కి దగ్గరయ్యింది. కొన్నాళ్లు ఈ ఇద్దరు లవ్‌ ట్రాక్‌ నడిపించారు. విషయం తెలిసి మనోజ్‌ ఫ్యామిలీ.. నగ్మాకి వార్నింగ్‌ ఇచ్చారని, దీంతో ఆమె ఆయనకు దూరమయ్యిందని సమాచారం. ఇలా నాలుగుసార్లు ప్రేమలో మోసపోయింది నగ్మా. నలుగురు స్లార్లూ ఆమెని మోసం చేశారు. దీంతో ప్రేమ, పెళ్లి అనే బంధంపైనే విరక్తి చెందిన నగ్మా ఇక మ్యారేజ్‌ చేసుకోకూడదని నిర్ణయించుకుందట. అలా నగ్మా ఇప్పటి వరకు మ్యారేజ్‌ చేసుకోలేదు. 
 

ఇదిలా ఉంటే నగ్మా.. `కిల్లర్` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ `ఘరానా మోగొడు` సినిమాతో బ్రేక్‌ అందుకుంది. `అశ్శమేథం`, `మేజర చంద్రకాంత్‌`, `వారసుడు, `కొండపల్లి రాజా`, `అల్లరి అల్లుడు`, `ముగ్గురు మొనగాళ్లు`, `సూపర్‌ పోలీస`, `గ్యాంగ్‌ మాస్టర్‌`, `ఆవేశం`, `మౌనం`, `రిక్షావోడు`, `అడవి దొర`, `భరత సింహం`, `సరదా బుల్లోడు`, `సూర్యపుత్రులు` చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని ఎన్టీఆర్‌కి అత్తగా `అల్లరి రాముడు` సినిమాలో మెరిసింది నగ్మా. 

read more: వెంకట్‌, సుశీలమ్మతో దెబ్బలు తిన్న నాగార్జున.. తండ్రి ఏఎన్నార్‌ లేకపోతే నాగార్జున చేసే పనులేంటో తెలుసా?

Latest Videos

click me!