అప్పుడు ఏంటి సత్య అని అడగగా దేవిని వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అనడంతో దేవుడమ్మ వద్దు అని అంటుంది. అప్పుడు సత్య మాటలకు దేవుడమ్మ ఆదిత్య ఆలోచనలో పడతారు. వీరి మాటలు దూరం నుంచి రాధ వింటూ ఉంటుంది. అప్పుడు వారి మాటలకు దేవి నేను కూడా వెళ్తాను అని అనడంతో దూరం నుంచి వింటున్న మాధవ సంతోషిస్తాడు. అప్పుడు దేవి, మాధవతో కలిసి వెళ్తూ ఉండగా అది చూసి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు.