Devatha: ఎవరు నమ్మిన నమ్మకపోయినా నా పెనిమిటి ఆదిత్య సారే.. నిజాన్ని బయటపెట్టిన రుక్మిణి?

Published : Jun 09, 2022, 12:37 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Devatha: ఎవరు నమ్మిన నమ్మకపోయినా నా పెనిమిటి ఆదిత్య సారే.. నిజాన్ని బయటపెట్టిన రుక్మిణి?

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆదిత్య (Rukmini) రుక్మిణి మెడలో తాళిబొట్టు చూసి ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత దేవుడమ్మ (Devudamma) నా కాబోయే కోడలు కోసం ప్రత్యేకంగా చేపించాను అని తాళిబొట్టు చూపిస్తుంది.. అది గుర్తు తెచ్చుకొని ఆదిత్య ఆరోజు చూపించింది అమ్మ ఇదే తాళి అని గ్రహించు కుంటాడు.
 

27

అంటే నేనే పొరపాటు పడ్డానా? అని ఆదిత్య (Adithya) ఆలోచించు కుంటూ ఉంటాడు. ఇక రుక్మిణి నాతో పెనిమిటి అంటూ మాట్లాడిందే.. కానీ ఏ రోజు మాధవ (Madhava) తన భర్త అని మాట్లాడ లేదు అని గ్రహించు కుంటాడు. రుక్మిణి గతంలో అన్న మాట మీద నిలబడి ఉంది అని ఏడుస్తూ ఉంటాడు.
 

37

మరోవైపు దేవి (Devi) తన అక్కను స్కూల్లో నెట్టేసినందుకు తోటి పిల్లలతో గొడవ పడుతూ ఉంటుంది. మరోవైపు రుక్మిణి (Rukmini) ఆఫీసర్ సార్ నా భర్త అని బిందాస్ గా చెప్పుకోలేని పరిస్థితి నాది అయ్యింది అని బాధపడుతూ వెళుతుంది.  ఇక ఈ లోపు మాధవ రుక్మిణికి ఎదురు పడతాడు. ఇక రుక్మిణి నేను నా భర్త ఆదిత్య అనే చెప్తాను అంటుంది.
 

47

ఇక అందరి ముందునే ఆదిత్య (Adithya) సార్ నా పెనిమిటి అని అరిచి మారి చెబుతాను అంటుంది. ఇక మాధవ పంచాయతీ పెట్టడం చాలా ఈజీ కానీ.. ఆ జనం ముందు ఆదిత్య నా భర్త అని చెప్పడం చాలా కష్టం అంటాడు. ఇక రుక్మిని (Rukmini) నా భర్తను నా భర్త అని చెప్పడానికి నాకేం భయంలేదు అని అంటుంది.
 

57

ఇక నా మాట విని ఆదిత్య (Adithya) నా భర్త అని పబ్లిసిటీ చేయడం ఆపేయ్ అని మాధవ (Madhava) అంటాడు. అయినా నేను aఆ మేడం తో మాట్లాడింది మీకెలా తెలుస్తుంది చాటుగా విన్నారా అని అడుగుతుంది. ఇలా తయారయ్యారు ఏంటి అని మాధవ మీద చిరాకు పడుతుంది. ఇక ఈ రోజు కూడా నా గుండెల మీద నా భర్త కట్టిన తాళిని మోస్తున్నాను అని తాళిబొట్టు తీసి చూపిస్తుంది.
 

67

ఈలోపు అక్కడకు ఆదిత్య (Adithya) వస్తాడు. నావల్ల కాకా కాదు మీ అమ్మానాన్నలు ఆగమై పోతారు అని బిడ్డలు ఏమై పోతారు అని ఆలోచించాను అని రుక్మిణి (Rukmini ) అంటుంది. ఇక ఒక్క క్షణం ఆలోచిస్తే నా ముందు నువ్వు నిలబడ్డ లేవు అని మాధవ కు వార్నింగ్ ఇస్తుంది.
 

77

ఇక ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆదిత్య (Adihya) నా భర్త..  అతను నాతో ఉన్నా లేకపోయినా..  అతడు కట్టిన తాళి బొట్టు నాతోనే ఉంది అని రుక్మిణి (Rukmini) అంటుంది. ఇక ఈ మాటలు ఆదిత్య కూడా వింటాడు. అంతేకాకుండా నా పెనిమిటి ప్రతి రూపాన్ని నా కడుపులో మోసాను అని రుక్మిణి అంటుంది.

click me!

Recommended Stories