VJ Sunny: బిగ్ బాస్ విజేత సన్నీపై రౌడీ షీటర్ దాడి.. షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ అటాక్

Published : Jun 09, 2022, 12:23 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో విజే సన్నీ విజేతగా నిలిచాడు. సీజన్ మొత్తం ఫుల్ జోష్ లో కనిపించిన సన్నీ అందరిని డామినేట్ చేసి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షోతో సన్నీకి మంచి పాపులారిటీ లభించింది.

PREV
16
VJ Sunny: బిగ్ బాస్ విజేత సన్నీపై రౌడీ షీటర్ దాడి.. షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ అటాక్

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో విజే సన్నీ విజేతగా నిలిచాడు. సీజన్ మొత్తం ఫుల్ జోష్ లో కనిపించిన సన్నీ అందరిని డామినేట్ చేసి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ షోతో సన్నీకి మంచి పాపులారిటీ లభించింది. సన్నీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. 

26

ఇదిలా ఉండగా తాజాగా సన్నీకి ఊహించని సంఘటన ఎదురైంది. షూటింగ్ లొకేషన్ లో ఉన్న సన్నీపై ఓ రౌడీ షీటర్ దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సన్నీ ఏటీఎం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని హస్తినాపురంలో జరుగుతోంది. 

 

36

షూటింగ్ జరుగుతుండగా ఓ రౌడీ షీటర్ లొకేషన్ లోకి ఎంటర్ అయ్యాడు. రాగానే సన్నీతో గొడవకి దిగాడు. అతడిపై దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది రౌడీ షీటర్ ని అడ్డుకుని.. సన్నీని కారులో ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై సన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు రౌడీ షీటర్ ని అదుపులోకి తీసుకున్నారు. 

46

అయితే రౌడీ షీటర్ కి, సన్నీకి మధ్య ఎందుకు గొడవ జరిగింది అనే వివరాలు బయటకి రాలేదు. బుధవారం రోజు ఈ సంఘటన జరిగింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

56

విజె గా కెరీర్ ప్రారంభించిన సన్నీ ఆ తర్వాత టివి సీరియల్స్ లో కూడా నటించాడు. బిగ్ బాస్ 5 విజేతగా నిలిచినా తర్వాత అతడికి వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. 

66

మరి సన్నీ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. బిగ్ బాస్ 5 లో సన్నీ, షణ్ముఖ్ మధ్య ప్రధాన పోటీ సాగింది. కానీ చివరకు సన్నీ విజేతగా నిలవడంతో షణ్ముఖ్ రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. 

click me!

Recommended Stories