Actress: అప్పుడు ఐశ్వర్యరాయ్‌కే వణుకు పుట్టించింది.. ఇప్పుడు సన్యాసిగా మారింది.. ఈ హీరోయిన్ ఎవరంటే.?

Published : Oct 10, 2025, 05:00 PM IST

Actress: ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఏకంగా ఐశ్వర్యరాయ్‌తోనే పోటీ పడింది. అయితే ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. సన్యాసిగా మారిపోయి.. ఎవ్వరూ గుర్తుపట్టనంతగా మారిపోయింది. మరి ఆ నటి ఎవరు.? ఏ సినిమాలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందామా..

PREV
15
రంగుల ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు

రంగుల ప్రపంచంలో చాలామంది ఉండలేరు. ఇండస్ట్రీలో అందం, అభినయం, అదృష్టంతో నిలదొక్కుకునే నటీమణులు కొందరైతే.. మరికొందరు నెపో కిడ్స్‌గా స్టార్ స్టేటస్, ఛాన్స్‌లు పొందుతారు. ఇంకొందరు హీరోయిన్స్ అయితే ఎంత ఫేం పొందినా.. తనకంటూ మనశ్శాంతి లేక.. ఆ రంగుల ప్రపంచాన్ని వదిలేస్తారు. ఆ కోవకు చెందిన నటి ఈమె. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి బర్ఖా మదన్.

25
'మిస్ టూరిజం ఇండియా'

1994లో 'మిస్ టూరిజం ఇండియా' టైటిల్‌ను గెలుచుకున్న బర్ఖా మదన్.. ఆ తర్వాత మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో మూడవ స్థానంలో నిలిచింది. అంతటి ఫేం దక్కించుకున్న బర్ఖా మదన్.. ఇప్పుడు సన్యాసినిగా ప్రశాంతతను కోరుకుంది.

35
'ఖిలాడియోం కా ఖిలాడి' మూవీతో అరంగేట్రం

1996లో సూపర్ హిట్ 'ఖిలాడియోం కా ఖిలాడి' మూవీతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఇందులో అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'భూత్' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అటు బుల్లితెరపై కూడా బర్ఖా మదన్ మెరిసింది. 'న్యాయ్', '1857 క్రాంతి', 'సాత్ ఫేరే' వంటి పలు షోలలో కనిపించింది. ఇలా ఆమె కెరీర్‌ పీక్స్‌కి చేరుతుండగా.. అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకుంది.

45
దలైలామా బోధనలకు ముగ్దురాలు

కెరీర్ స్టార్టింగ్ నుంచి దలైలామా బోధనలకు ముగ్దురాలు అయిన బర్ఖా.. ఈ రంగుల ప్రపంచం నుంచి ప్రశాంతతను పొందలేకపోయింది. దలైలామా రచించిన పుస్తకాలను చదువుతూ.. ఆయన బోధనలు వింటూ తనను తాను మార్చుకుంది. 2012లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది. తన పేరును వదిలేసి.. గ్యాల్టెన్ సామ్టెన్ అనే కొత్త పేరును పెట్టుకుంది.

55
హిమాలయాలలో నివాసం

హిమాలయాలలోని ప్రశాంతమైన లోయలలో నివసిస్తూ.. ధ్యానం, సేవ, తనను తాను కొత్తగా మలుచుకుంటూ సాధారణమైన జీవితాన్ని సాగిస్తోంది. కాగా, ఒకప్పుడు ర్యాంప్‌పై మెరిసిన ఈ హీరోయిన్ ఇప్పుడు బౌద్ధ సంప్రదాయాలను స్వీకరించి.. అన్ని రకాల విలాసాలకు పూర్తిగా దూరంగా ఉంది. ఆమె తరచుగా బౌద్ధమతంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. చాలాసార్లు ఆమె దలైలామాను కూడా కలిసింది.

Read more Photos on
click me!

Recommended Stories