చిరు , బాలయ్య , వెంకటేష్ తో రొమాన్స్ చేసిన భానుప్రియ , నాగార్జున తో మాత్రం ఎందుకు నటించలేదు?

Published : Oct 10, 2025, 03:17 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది సీనియర్ హీరోయిన్ భానుప్రియ. కానీ టాలీవుడ్ లో నాగార్జున జోడీగా మాత్రం నటించలేకపోయింది. అందుకు గల కారణాలు ఏంటి? ఈ విషయంలో భానుప్రియ చేసిన కామెంట్స్ ఏంటి?

PREV
16
సౌత్ స్టార్ సీనియర్ హీరోయిన్

80, 90 దశకంలో తెలుగు సినీ పరిశ్రము ఏలిన తారల్లో భానుప్రియ ఒకరు. అందం అభినయంతో కట్టిపడేసిన ఆమె, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయిన భానుప్రియ.. ఆతరువాత హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్, వెంకటేష, మోహన్ బాబు, సుమన్, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది సీనియర్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా భానుప్రియ బాగా పాపన్ హీరోయిన్ గా మారింది. హిందీ నుంచి అవకాశాలు వచ్చినా.. తెలుగులో బిజీగా ఉండటం వల్ల, అటువైపు వెళ్లలేకపోయింది.

26
అత్యధిక సినిమాలు ఏ హీరోతో?

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన భానుప్రియ హీరో సుమన్ తో అత్యధిక సినిమాలు చేశారు. సుమన్, భానుప్రియ జోడీగా దాదాపు 14 సినిమాలు తెరకెక్కాయి. ఆతరువాత నందమూరి బాలయ్యతో దాదాపు 8 సినిమాల వరకూ నటించారు భానుప్రియ. ఇక విక్టరీ వెంకటేష్ జోడీగా ఆమె నటించిన స్వర్నకమలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కే.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో.. డాన్సర్ గా భానుప్రియ నటన అందరికి కట్టిపేస్తుంది. స్వతహాగా క్లాసికల్డాన్స్ అవ్వడంతో, భానుప్రియకు ఆ పాత్ర బాగాకలిసి వచ్చింది.

36
నాగార్జునతో మాత్రం నటించలేదు.

సౌత్ లో స్టార్ హీరోలందరితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన భానుప్రియ ఒక్క నాగార్జునతో మాత్రం హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వీరి కాంబినేషన్ లో అన్నమయ్య సినిమా ఒక్కటే వచ్చింది. కానీ ఆసినిమాలో కూడా జంటగా నటించలేదు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు భానుప్రియా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించాను కానీ.. నాగార్జునతో నటించే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఆ అవకాశం వచ్చుంటే ఖచ్చితంగా చేసేదాన్ని, కానీ ఆ సందర్భం ఎప్పుడూ రాలేదు. ముందు ముందు చేద్దాంలే అనుకున్న టైమ్ కు పెళ్లి చేసుకుని, సినిమాల నుంచి బయటకు వచ్చేశాను. ఆ లోటు అలానే ఉండిపోయింది అన్నారు.

46
నాగార్జున జోడీగా భానుప్రియ చెల్లెలు

అయితే భానుప్రియా నటించలేకపోయినా.. ఆమె చెల్లెలు శాంతిప్రియ మాత్రం నాగార్జున జంటగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అగ్ని సినిమా సూపర్ హిట్ అయ్యింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆతరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు శాంత్రి ప్రియ. ఇక భానుప్రియ మాత్రం నాగ్ తో సినిమాలు చేయాలని ఉన్నా చేయలేకపోయింది.

56
బాలయ్య ఆత్మీయంగా పలకరిస్తారు

భానుప్రియ హీరోయిన్ గా కొనసాగుతున్న కాలంలో చాలామంది హీరోయిన్లు స్టార్లుగా వెలుగు వెలిగారు. అయితే వారంతా 80స్ యూనియన్ పెట్టుకుని ఏడాదికొక్కసారి కలుస్తుంటారు. కానీ ఈ గ్రూప్ లో భానుప్రియా ఎప్పుడు కనిపించలేదు. ఎందుకు వళ్లరు అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. నన్ను పిలవలేదు, నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు అని అన్నారు. అంతే కాదు ఇండస్ట్రీలో బాలయ్య మాత్రం చాలా ఆత్మీయంగా పలకరిస్తారని భానుప్రియ వెల్లడించారు. ఓ సారి ఎయిర్ పోర్టులో కనిపించి చాలా బాగా మాట్లాడారట. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మా ఇంటికి రా అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాట. అంతే కాదు అమ్మ ఎలా ఉన్నారు అని కూడా అడుతారట బాలయ్య. ఇక మిగతా వాళ్ళతో పెద్దగా టచ్ లో లేను కానీ.. ఎవరైనా ఎదురైతే మాతరం బాగా మాట్లాడుకుంటా అని అన్నారు భాను ప్రియ.

66
భానుప్రియ ఇప్పుడేం చేస్తోంది.

హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత భానుప్రియ పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది. ఫారెన్ లో సెటిల్ అయిన తెలుగుఫ్యామిలీకి కోడలిగా వెళ్లింది. భానుప్రియకు ఓ పాప పుట్టిన తరువాత భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆతరువాత బిడ్డతో పాటు చెన్నైలో సెటిల్ అయ్యింది మాజీ హీరోయి. ఇండియా వచ్చిన తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భానుప్రియ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. చత్రపతి, దమ్ము, గౌతమ్ SSC లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది భానుప్రియా. ప్రస్తుతం కొన్ని అనారోగ్య కారణాల వల్ల సినిమాలు మానేసి, డాన్స్ స్కూల్ ను నడిపిస్తూ.. కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమద్య తమిళంలో కొన్ని సీరియల్స్ కూడా చేశారు భానుప్రియా,ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ముందు ముందు అవకాశాలు వస్తే నటిస్తారా లేదా తెలియదు.

Read more Photos on
click me!

Recommended Stories