Tulasi Retires from Films : సినిమాలు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు సౌత్ సీనియర్ నటి తులసి. తన తరువాతి జీవితం సాయి సేవలో గడపాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు.
తల్లి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ప్రముఖ నటి తులసి, తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31న సాయి బాబా దర్శనం చేసుకుని.. తన నట జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తులసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె ఈ నిర్ణయం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
24
చిన్నవయసులో సినిమాల్లోకి ఎంట్రీ
చాలా చిన్న వయసులోనే తులసి సినిమా కెరీర్ ప్రారభించింది. 1964 లో మూడున్నర నెలల పసిపాపగా ఉన్నప్పుడు ‘జీవన తరంగాలు’ అనే సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది తులసి. ఆమె తల్లి, అలనాటి నటి సావిత్రికి సన్నిహితురాలు కావడంతో, ఆ చిత్రంలో ఉయ్యాలలలో ఊగే పసిపాప పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత నాలుగేళ్ల వయసు నుంచే బాలనటిగా తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లో 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణంలో బాలనటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
34
హీరోయిన్ గా, తల్లిగా అనేక పాత్రల్లో
తులసి బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న తరువాత.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయన్ గా చంద్రమోహన్ లాంటి హీరోలతో నటించిన తులసి.. తెలుగుతో పాటు వివిధ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. ఇక తులసి కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం సినీ రంగానికి విరామం ఇచ్చారు. ఈ విరామం తరువాత ఆమె మరోసారి రీఎంట్రీ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం ప్రారంభించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఆమె ప్రభాస్, శృతీ హాసన్ లాంటి వారికి తల్లిగా నటించి మెప్పించారు.
ఈమధ్య కాలంలో తులసి పెద్దగా సినిమాలు చేయడంలేదు. అవకాశాలు వస్తున్నా.. తులసి సినిమాల సంఖ్యను తగ్గించుకుంది. ఈ సమయంలో ఆమె సాయిబాబా సన్నిధానంలో గడపడానికి కేటాయించింది. బాబాపై భక్తిని తరచూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉంటుంది తులసి. ఇక తన తాజా పోస్ట్‌లో డిసెంబర్ 31న సాయిబాబా దర్శనం చేసుకోనున్నానని, అదే రోజు తన నటన జీవితానికి చివరి రోజు అవుతుందని పేర్కొన్నారు. దీనితో ఆమె సుదీర్ఘమైన సినీ ప్రయాణం ముగించబోతున్నట్టు తెలుస్తోంది.