వారణాసి సినిమా టైటిల్ టీజర్ లో మహేష్ బాబు ఎద్దుపై కూర్చోని దూసుకోస్తూ కనిపించాడు. అయితే ఈ లుక్ టాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు.. గతంలో కొంత మంది హీరోలు ఇలానే ఎద్దుపై కూర్చోని కనిపించారు.
మహేష్ బాబు – రాజమౌళి కాంబో మూవీ వారణాసి. ఈ భారీ బడ్జెట్ మూవీ టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. వారణాసి ఈవెంట్‌లో చిత్రం టైటిల్ గ్లింప్స్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో మహేష్ బాబు ఎద్దుపై కూర్చొని త్రిశూలం పట్టుకొని విలన్ల పైకి దూసుకెళుతున్నట్టు చూపించారు. పైగా ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ కూడా ఎద్దుపైన ప్లాన్ చేసేవరకు.. అభిమానులు దిల్ ఖుష్ అయ్యారు. ఇక మహేష్ బాబు ఎద్దుపై వస్తున్న పోస్టర్ కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ ను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు.
24
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా..
మహేష్ బబు ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తరువాతనెటిజన్లలో మరో చర్చ మొదలైంది. ఇలా ఎద్దుపై ఫోజ్ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారని కామెంట్స్ చేస్తూనే.. మహేష్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పోల్చుతున్నారు. “మా బెల్లంకొండ బాబు ఇదే సీన్ ఎప్పుడో చేసి చూపించాడు” అంటూ టీజ్ చేస్తున్నారు. . హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమాలో ఆయన కూడా ఎద్దుపై కూర్చొని త్రిశూలం చేత పట్టుకుని ప్రత్యర్థులపైకి వెళ్లే సీన్ ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
34
బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్
టాలీవుడ్‌లో ఇదే తరహా సీన్లు గతంలో కూడా కనిపించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో కూడా ఇదే తరహా సీన్ కనిపిస్తుంది. విలన్లతో ఫైట్ చేసే టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదకు పశువుల గుంపు వస్తుంది. వాటిని తప్పించుకున్న పవన్ కళ్యాన్.. అందులో ఒక ఎద్దును పట్టుకుని... దాని మీదకు ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తాడు. ఈసీన్ కు థియేర్లో విజిల్స్ కూడా పడ్డాయి.
అలాగే గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన భీమాలో హీరోలు ఎద్దులపై కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. గోపీచంద్ పోలీస్ డ్రెస్ లో ఎద్దుపై కూర్చుని స్వరీ చేసిన సీన్ కనిపిస్తుంది. ఇక వీళ్లే కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా ఎద్దులతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు పోస్టర్‌లో కనిపించిన లుక్ మాత్రం అభిమానులకు కు పూనకాలు తెప్పిస్తోంది.